Pravahini

" చైతన్య స్పూర్తి " గ్రంధకర్త కు అభినందన
============================
=====================

స్థానిక సిరిసిల్ల పట్టణంలోని శ్రీ గురుకుల ఆశ్రమ హనుమాన్ దేవస్థానములో ఉగాది పర్వదినంను పురస్కరించుకొని   జరిగిన కార్యక్రమంలో ....ప్రముఖ సాహితీవేత్త, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ తను రచించిన చైతన్య స్ఫూర్తి వ్యాససంపుటి పుస్తకాన్ని గురుకులాశ్రమ   పుర ప్రముఖులకు అందజేశారు.  సంఘ అధ్యక్షులు గౌడ రాజు, ప్రధాన కార్యదర్శి  వెంగళ భాస్కర్ లతోపాటు సంఘ కార్యవర్గం  చిటికెనను అభినందించి ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా సంఘ  అధ్యక్షులు, గౌడ రాజు  మాట్లాడుతూ.... గురుకులాశ్రమ సంఘాన్ని , సిరిసిల్ల పేరును ఉన్నత స్థానంలో నిలబెడుతున్న  చిటికెన వివిధ   రాష్ట్రాలలో జాతీయ, అంతర్జాతీయ  సాహిత్య సామాజిక సేవా సంస్థల ద్వారా  పలు పురస్కార, సన్మాన సత్కారాలు  అందుకోవడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు . కార్యక్రమంలో   ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్తలు, సంఘ కార్యవర్గ సభ్యులు బొట్ల వెంకటస్వామి, బూట్ల సుదర్శన్,, చిటికెన కనకయ్య, బూట్ల  సతీష్, బైరి సత్యనారాయణ, చిలుక సత్యం, ఏనుగుల ప్రభాకర్ ,చిటికెల వెంకటేశం, చింతకింది మల్లికార్జున్, చిటికెన శ్రీనివాస్, సత్తయ్య, యెల్దండి  శ్రీనివాస్, ఏనుగుల లక్ష్మణ్, గౌడ కిరణ్  కొండరాజు, అన్నల్ దాస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments