లక్ష్మీదేవికిదే ఆహ్వానం

లక్ష్మీదేవికిదే ఆహ్వానం

ఇల్లువాకిలి శుభ్రంగ
ఉంటెనే లక్ష్మీప్రదము
మనసు స్వచ్ఛమైన
లక్ష్మీదేవికి ఇష్టము
అంతఃకరణ స్వంచ్చంగ
ఉండటమే ముఖ్యము

నిత్యం శుచిశుభ్రత
పాటించే వారింట
లక్ష్మీదేవి ధనదేవత
కొలువుండు వారింట
శుచిశుభ్రత పాటించు
లక్ష్మిని ఆహ్వానించు

అహంవున్న చోట
లక్ష్మీ నిలిచి ఉండదు
అసత్యం మాట్లాడం
లక్ష్మీదేవి కి నచ్చదు
నీతి నియమం కావాలి
లక్ష్మీ కరుణ పొందాలి

ధనలేమి మనిషిని
ఎక్కువగ బాధిస్తుంది
ఆత్మ నూన్యతపెంచి
నిస్సాహాయపరుస్తుంది
ధనదేవత నిలువాలన్న
మంచిమార్గం నడవాలి

ఆర్ధిక ఇబ్బందులతో
రోజుగడువకష్టము
ధనం ప్రాధాన్యత
తెలుస్తది స్పష్టము
ప్రాధాన్యమైన డబ్బు
లేకుంటే కలుగుజబ్బు

తగినంత ధనము
ఉంటేనే ఆనందము
ప్రణాళిక బద్దంగా
ఏపనైన చేయగలము
ధనమే మూలము
లేనిదేమి చేయలేము

ధనం మనిషికి ఆత్మ
విశ్వాసాన్ని పెంచును
ధనం మనిషికి ఆత్మ
గౌరవం కలిగించును
నిత్యం శ్రమించు
లక్ష్మిని ఆహ్వానించు

సోమరిగా కాలాన్ని
వృధాచేయువారింట
లక్ష్మీదేవి నిలువదు
శ్రమతత్వమ్లేనిచోట
లక్ష్మీదేవి చేరును
శ్రమించువారింటికి

పవిత్రత ఉన్నచోట
లక్ష్మీదేవి స్థిరంగా
ప్రశాంతలున్నచోట
ఉంటుంది ఇష్టంగా
ఇష్టమైనచోట లక్ష్మీదేవి 
ఇల్లువిడువదెప్పటికి

తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.

0/Post a Comment/Comments