యుగ యుగాల ఉగాది పర్వం
------------------------------------------
చైత్ర శుక్ల పాడ్యమి
సృష్టి కి అంతం
అదే రోజు యుగం ఆరంభం
ఆ రోజే యుగాదిగా పరిగణం
అదే కాల క్రమేణా ఉగాదిగా ప్రాచుర్యం.
ఈ ఉగాది పర్వదినం నాడే
వసంత ఋతువు ప్రారంభం
అదే నేటి రోజుకు మరో విశేషం
నూతన సంవత్సరం
ఈనాటినుండే ప్రారంభం.
పెద్దవారి ఆశీర్వాదం
ఇష్ట దేవుడి ఆరాధనం
మనసుకుకలిగించు ఉల్లాసం
నాటి పంచాంగ శ్రవణం.
షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పచ్చడి పానకం
తియ్యని భక్షాల ఆహారం
కమ్మని పిండివంటల భోజనం.
ఇంటిల్లి పాదికి ఆహ్లాదం
ఊరంతా పండగ వాతావరణం
సంతోషం తెమ్మని తెలుపుదాం
ఈ పండగకు ఆహ్వానం
ఆనందం పంచమని ఈ పండగను కోరుకుందాం.
ఈ శుభకృత్
సంవత్సరమంతా
ప్రతి ఇంటా శుభములు కలగాలని,సుఖసంతోషాలు
నిండాలని కోరుకుందాం..!!
ఎన్.రాజేష్-ఎమ్మెస్సి
(కవి,రచయిత,జర్నలిస్ట్)