'ఒత్తుల గేయాలు'' పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెచ్.మురవణి లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 18వ పుస్తకం 'ఒత్తుల గేయాలు' పుస్తకావిష్కరణ నందవరంలో స్థానిక గ్రంథాలయాధికారి శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో,కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీనివాసరెడ్డి మరియు యం.ఇ..ఓ శ్రీ సుదర్శన్ రెడ్డి చేతుల మీద ఘనంగా జరిగింది.తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా బాలసాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనతికాలంలోనే 18 పుస్తకాలు రచించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గద్వాల సోమన్నను అందరూ ప్రశంశలతో ముంచెత్తారు.వారి తెలుగు సాహితీ కృషిని,ప్రతిభాపాటవాలను కొనియాడారు . ధారాళంగా చదవడానికి, తడబడకుండా ,తప్పులు లేకుండా వ్రాయడానికి ."ఒత్తుల గేయాలు" ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమని వక్తలు అభిప్రాయపడ్డారు.తరువాత రచయిత గద్వాల సోమన్నను ,ముఖ్య అతిథులను దుశ్శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.కవి గద్వాల సోమన్న మాట్లాడుతూ సాహిత్యంలో బాలసాహిత్యం తక్కువని ,దాని అభివృద్ధి కి అందరూ తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో కె.శైలజ కె.జి.బి.వి ప్రిన్సిపాల్ ,లక్ష్మినారాయణ ప్రధానోపాధ్యాయులు ,శివ రామ్ లైబ్రరీయన్,పౌరోహితం శ్రీనివాసులు,పాత్రికేయులు, పాఠకులు, లైబ్రరీ సిబ్బంది మరియు పుర ప్రముఖులు పాల్గొన్నారు.