హెచ్.మురవణి పాఠశాలలో సరస్వతీ పూజా కార్యక్రమం
-----------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం సందర్భంగా "సరస్వతీ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగింది.ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,ఉపాధ్యాయులు తమ దివ్యమైన సందేశాలతో విద్యార్థులను ఉత్తేజ పరిచారు.ఏప్రిల్ 27 నుంచి జరుగబోయే పది పరీక్షల్లో సంపూర్ణ ఉత్తీర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పదవ తరగతి అన్నీటికీ కీలకమని,కష్టే ఫలి' ఉద్ఘాటించారు. ప్రముఖ బాలసాహిత్యవేత్త,గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న "పదవ తరగతి" లోని అక్షరాలపై అర్ధవంతమైన, స్ఫూర్తిదాయకమైన గేయ కవిత వ్రాసి,చదివి వినిపించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.యం శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శివనాగజ్యోతి,హస్ర ఉన్నీసా బేబీ,జయరాజు,లక్ష్మీ నారాయణ, పౌరోహితం శ్రీనివాసులు, రాజశేఖర్,తాయప్ప,గద్వాల సోమన్న, ఆంజనేయులు, పూజారి,పురప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.