శీర్షిక: ఉగాది ఊతమవ్వాలి
ఉగాదొచ్చిందప్పుడే
ఏడాది గడిచిందిప్పుడే
జీవితాన్ని సరిచూసుకుని సరిచేసుకునేందుకు
ఒడిదుడుకులు
జయాపజయాలను
సంతోషదుఃఖాలను
సమంగా స్వీకరించి
సరికొత్త
సంవత్సరానికి స్వాగతమహోత్సవమిదే
ఎందుకంటే
గడిచిన ఉగాదులు
ఎదలో మానిని గాయాలను
మనిషికి మనిషికి మధ్య
పెద్ద అగాధాలను
తడారని కన్నీళ్ళజాడలనుంచి
కళ్ళముందు ఆప్తులు మాయమవుతున్నప్పుడు
కడచూపుకు సైతం నోచుకోలేదపుడు
పలకరింపులకు కరువొచ్చింది
ధనికబీద తేడాలేక
లోకం విడిచారెందరో
కానీ...
భారతీయ ఆయుర్వేదం
ప్రపంచానికంతా
చూపించే
ఆరోగ్య మార్గం
మన ఆచార అలవాట్లు
విశ్వవ్యాప్తంగా మార్గదర్శమై
మన ఘనతచాటించే
విపత్తులెన్నెదురొచ్చినా
విడవని విశ్వాసం
మరోజన్మనెత్తడమే విజయం
అందుకే
పెంచుకోవాలందరం
రోగనిరోధకశక్తి
స్వచ్ఛమైన ఆరోగ్యపుటహారపు అలవాట్లు
యేగధ్యానాలే మనకాయుధాలు
జగతిగతినంతా కాపాడే రక్షణకవచాలు
ఈ ఉగాది కావాలి
ఆకలి కడుపుల్లో మంటలు చల్లార్చే చిగురులు వికసించేలా
శ్రామికుల చెమటచుక్కలకు
విలువను పెంచే
నవ వసంతాలుదయించాలి
శుభకృత్ నామ ఉగాది
పుడమినంతా పులకించే వారదవ్వాలి
శోభయమానమై భవిత చైతన్యమై వికసించాలి
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.