రైతు స్వరాజ్యం మల్లెలం
----------&&&&&------------
ఖైదీ కన్నయ్య పిల్లలం
రైతు స్వరాజ్యం మల్లెలం
కష్టాలు పడుతున్న వారలం
నష్టాలతో చెడుతున్నపోరలం !
కన్నయ్య పేరున్న మా నాన్న
నిరపరాధి అని మేం అన్నా
వినలేదు కళ్ళులేని ఆ కోర్టు
దోషిని చేసి అందించే రిపోర్టు !
దానితో ఖైదీ కన్నయ్యగ మారాడు
తానుఆటుపోట్ల తట్టుకొని తీరాడు
అన్యాయంగ అనుభవిస్తుండు శిక్ష
న్యాయ పోరాటానికి అతనికో పరీక్ష
రైతు స్వరాజ్యం గ్రహించే పరిస్థితి
బైతైనా చేపట్టే పోరాటం సంస్కృతి
ఫలితంగా లభించే న్యాయానికి రక్ష
అన్యాయానికి తప్పలేదు ఇక శిక్ష !
ఖైదీ కన్నయ్య పిల్లలం
రైతు స్వరాజ్యం మల్లెలం
కలసి మెలసి పోరాటం
చేసి తీర్చుకున్నం ఆరాటం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.