ప్రశ్నపత్రం చదవడానికి 15ని.
పరీక్ష రాయడానికి 180ని.
మొత్తం మార్కులు: 80
పార్ట్ - A 60మార్కులు
పార్ట్ - B 20మార్కులు
అ) పార్ట్ - 'ఎ' - పదవ తరగతి తెలుగు (ప్రథమ భాష)లో మొత్తం పన్నెండు పాఠాలున్నాయి. వీటిలో 4. కొత్తబాట, 5. నగరగీతం, 11. భిక్ష అనే మూడు పాఠ్యాంశాలను పబ్లిక్ పరీక్షల నుండి మినహాయించారు. కాబట్టి ఈ పాఠ్యాంశాల నుండి పార్ట్ -'A'లో ఎలాంటి ప్రశ్నలు ఇవ్వకూడదు. మిగిలిన పాఠ్యాంశాలు.రామాయణం ఉపవాచకం నుండి మాత్రమే పార్ట్ -'A' ప్రశ్నలను రూపొందించాలి. అలానే పార్ట్-'B' లోని పదజాలం ప్రశ్నలకు కూడా ఈ పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి.
ఆ) పార్ట్-'బి' లోని వ్యాకరణాంశాల ప్రశ్నలకు మాత్రము అన్ని పాఠాలలోని వ్యాకరణాంశాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇ) మొత్తం 80 మార్కుల కోసం ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి.
సామర్థ్యాల వారీగా భారత్‌వం ప్రశ్నలు, మార్కులు
అవగాహన-ప్రతిస్పందన - 20 మార్కులు
(పరిచిత గద్యం, పద్యం, అపరిచిత గద్యం)
స్వీయ రచన - 33 మార్కులు
3×4=12 (లఘుసమాధాన ప్రశ్నలు)
3×7=21 (వ్యాసరూప సమాధాన ప్రశ్నలు)
సృజనాత్మకత - 7 మార్కులు
1×7=7 మార్కులు
పదజాలం - 10 మార్కులు
వ్యాకరణాంశాలు - 10 మార్కులు
సామర్థ్యాల వారీగా ప్రశ్నలు, మార్కుల వివరాలు :
I. అవగాహన - ప్రతిస్పందన - 20 మార్కులు
1. పరిచిత గద్యం - 5 మార్కులు (5X1=5 మార్కులు)
ఉపవాచకం 'రామాయణం' నుండి 'పేరా' ఇవ్వాలి.
దీని ఆధారంగా అవగాహన ప్రశ్నలు '5' ఇవ్వాలి. ఒక్కొక్క ప్రశ్నకు '' ఒక మార్కు.మొత్తం మార్కులు 5.
2. పరిచిత పద్యం - 10 మార్కులు
సూచించిన పాఠ్యంశాలలోని (పద్యభాగం) చుక్కలను ఇవ్వాలి.
మూడు ప్రశ్నలు ఇస్తే ఒక ప్రశ్నకు జవాబు రాయాలి.
పద్యాన్ని పూరించి దాని భావం రాయడం రెండు ప్రశ్న ఇవ్వాలి.
పద్యానికి ప్రతిపదార్ధం రాయడం ఒక ప్రశ్న ఇవ్వాలి.
ఇలా మొత్తం 3 ప్రశ్నలు ఇవ్వాలి.
3. అపరిచిత గద్యం - 5 మార్కులు (5X1=5 మార్కులు)
అపరిచిత గద్యం 6 నుండి 8 వాక్యాల పేరాను గద్యంగా ఇవ్వాలి.
దీని ఆధారంగా 5 అవగాహన ప్రశ్నలు ఇవ్వాలి.
ఒక్కొక్క దానికి '1' మర్కు చొప్పున ఉంటాయి.
II.వ్యక్తీకరణ - సృజనాత్మకత - 40 మార్కులు
1. స్వీయరచన - 33 మార్కులు
అ) లఘు సమాధాన ప్రశ్నలను కూడా సూచించిన పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి.3X4=12 మార్కులు
మొత్తం '6' ప్రశ్నలు ఇవ్వాలి. వీటిలో '3' ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు '4' మార్కుల చొప్పున ఉంటాయి. 12 మార్కులు
వీటిని వరుసగా కలిపి ఇవ్వాలి. ఇవి విభాగ ఇవ్వకూడదు.
2 ప్రశ్నలు కవి / రచయిత పరిచయం ప్రశ్నలు అనగా ఒక ప్రశ్న పద్యభాగం పాఠాలు, 2వ ప్రశ్న గద్యభాగం పాఠాల నుండి ఇవ్వాలి.
మిగిలిన నాలుగు ప్రశ్నలలో '2' ప్రశ్నలు పద్య భాగం పాఠాలు, మిగిలిన '2' ప్రశ్నలు గద్యభాగం పాఠాల నుండి ఇవ్వాలి.
ఆ) వ్యాసరూప సమాధాన ప్రశ్నలు - 3X7=21 మార్కులు
వ్యాసరూప సమాధాన ప్రశ్నలను కూడా సూచించిన పాఠ్యాంశాల నుండే ఇవ్వాలి.
వ్యాసరూప సమాధాన ప్రశ్నల కోసం గద్యభాగం, పద్యభాగం, ఉపవాచకం రామాయణం నుండి రెండేసి ప్రశ్నల చొప్పున ఆరు ప్రశ్నలను కలిపి ఇవ్వాలి.
6 ప్రశ్నలను తప్పనిసరిగా 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి.
ఒక్కొక్క ప్రశ్నకు 7 మార్కుల చొప్పున మొత్తం 3 ప్రశ్నలకు 21 మార్కులు.
2. సృజనాత్మకత - 7 మార్కులు (1×7=7 మార్కులు)
సూచించిన పాఠ్యాంశాలలోని పాఠాలలో పరిచితమైన సృజనాత్మక ప్రశ్నల ఆధారంగా ఇవ్వాలి.
3 ప్రశ్నలు ఇస్తే ఒక ప్రశ్నకు జవాబు రాయాల్సి ఉంటుంది.
దీనికి '7' మార్కులు ఉంటాయి.
III. భాషాంశాలు - 20 మార్కులు
1. పదజాలాంశాలు - 10 మార్కులు (10X1= 10 మార్కులు)
సూచించిన పాఠ్యాంశాలలోని విషయాల ఆధారంగా ఇవ్వాలి.
ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 10 మార్కులు ఉంటాయి.
వీటిలో '2' ప్రశ్నలు సొంతవాక్యాలు రాయడానికి ఇవ్వాలి. మిగిలిన '8' ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వాలి.
అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, పదవివరణలు, జాతీయాలు మొదలగు వాటిని ప్రశ్నించాలి.
2. వ్యాకరణాంశాలు - 10 మార్కులు (10X1= 10 మార్కులు)
పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలు అనగా 12 పాఠాలలోని వ్యాకరణాంశాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు చొప్పున 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10 మార్కులు ఉంటాయి.
సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాల రకాల నుండి ప్రశ్నలు ఇవ్వాలి.
ప్రశ్నపత్ర వివరణ
I. అవగాహన - ప్రతిస్పందన - 20 మార్కులు
ఈ విభాగం కింద మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి
పరిచిత గద్యం - (ప్రశ్నలు 1-5)
ఉపవాచకం రామాయణం నుండి పేరా ఇచ్చి కింద 5 ప్రశ్నలు ఇస్తారు. పేరు చదివిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 5మార్కులు. రామాయణములో గల ఆరు కాండములలోని కథ ఏ కాండంలో ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి.
పరిచిత పద్యం - (6వ ప్రశ్న)
పాఠ్య పుస్తకంలోని 1. దానశీలము, 3. వీర తెలంగాణ, 7. శతక మధురిమ పాఠాలలోని కంఠస్థ పద్యాలు 3అడుగుతారు. అందులో రెండు పద్యాలు పాదభంగం లేకుండా పూరించి భావం రాయమని, ఒక పద్యం ప్రతిపదార్థం రాయమని ఉంటాయి. ఇందులో ఒకటి రాయాలి. కాబట్టి దానశీలము, వీరతెలంగాణలో గల ఆరు పద్యాలను కంఠస్థం చేసి భావాలను కూడా గుర్తుంచుకోవాలి. ఇందుకు గాను 10మార్కులు.
అపరిచిత గద్యం - (ప్రశ్నలు 7-11)
ఒక గద్యం ఇచ్చి అందులోనుండి 5 ప్రశ్నలు తయారు చేయమంటారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం 5మార్కులు. తయారు చేసి రాసే ప్రశ్నలకు సమాధానాలు ఆ గద్యంలో ఉండాలి. ప్రశ్న చివరన క్వశ్చన్ మార్క్ తప్పకుండా ఇవ్వాలి.
II. వ్యక్తీకరణ - సృజనాత్మకత - 40 మార్కులు
1. స్వీయరచన - 33 మార్కులు
2. సృజనాత్మకత - 7 మార్కులు
స్వీయ రచన - ఇందులో రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు.
లఘు ప్రశ్నలు - (ప్రశ్నలు 12-17)
ఇందులో 6ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. మూడింటికి సమాధానాలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 4మార్కులు. మొత్తం 12మార్కులు. 6ప్రశ్నలలో 3పద్యభాగం, 3గద్యభాగం నుండి ప్రశ్నలుంటాయి. ఇందులో రెండు ప్రశ్నలు కవిపరిచయం గురించి ఉంటాయి. ఒకప్రశ్న పద్యభాగం నుండి, ఇంకోటి గద్యభాగం నుండి ఉంటాయి. కాబట్టి గద్యభాగ పాఠ్యాంశాలు 2. ఎవరి భాష వవాళ్ళకు వినసొంపు, 6. భాగ్యోదయం, 8. లక్ష్యసిద్ది, 10. గోల్కొండ పట్టణం 12. భూమిక ఈ ఐదు పాఠాల కవిపరిచయాలు చదవాలి. మిగిలిన 4ప్రశ్నలు పద్యభాగం నుండి రెండు, గద్యభాగం నుండి రెండు వస్తాయి.
వ్యాసరూప ప్రశ్నలు - (ప్రశ్నలు 18-20)
ఇందులో అంతర్గత అవకాశం(ఇంటర్నల్ ఛాయిస్) తో మూడు ప్రశ్నలు ఉంటాయి. పద్యభాగం, గద్యభాగం మరియు ఉపవాచకం నుండి ఇంటర్నల్ ఛాయిస్ తో ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 7మార్కులు. మొత్తం 21మార్కులు.
సృజనాత్మక - (ప్రశ్నలు 21-23)
ఇందులో లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కరపత్రం, కవితా రచన, గేయ రచన మొదలైన సృజనాత్మక అంశాలు 3ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు రాయాలి. ఇందుకుగాను 7మార్కులు.
III. భాషాంశాలు - 20 మార్కులు
1. పదజాలాంశాలు - 10 మార్కులు
2. వ్యాకరణాంశాలు - 10 మార్కులు
1. పదజాలాంశాలు - (ప్రశ్నలు 1-10)
సూచించిన పాఠ్యాంశాలలోని విషయాల ఆధారంగా ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు. 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10మార్కులు. వీటిలో '2' ప్రశ్నలు సొంతవాక్యాలు. మిగిలిన '8' ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు.అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, పదవివరణలు, జాతీయాలు మొదలగు వాటి నుండి ప్రశ్నలు ఉంటాయి. తొలగించినవి కాకుండా మిగిలిన 9పాఠాలలో గల అన్ని పదజాల అంశాలను చదవాలి. వీటితో పాటు పాఠ్యపుస్తకం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
2. వ్యాకరణాంశాలు - (ప్రశ్నలు 11-20)
పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠ్యాంశాలు అనగా 12 పాఠాలలోని వ్యాకరణాంశాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక్కొక్క ప్రశ్నకు 1 మార్కు. 10 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 10 మార్కులు. సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాల రకాల ప్రశ్నలు ఉంటాయి. వాక్యాల రకాలు అంటే సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు. కర్తరీ, కర్మణీ వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన వచనం ఆధునిక వచనం నుండి మార్చడం మొదలైనవి. అన్ని ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలే (ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు)
సమయ విభజన
పరీక్ష సరిగా రాయాలి అంటే సమయ పాలన చాలాముఖ్యం.
మొత్తం మార్కులు : 80
మొత్తం సమయం : 3గం. 15. ని.
ఇందులో ప్రశ్నపత్రం చదవడానికి 15ని.
మిగిలింది 3గం.లు అంటే 180ని.లు
ఇందులోనుండి పార్ట్ బి కొరకు 30ని.లు - మార్కులు 20
30ని.÷20మా.=1.5ని. పార్ట్ బి ఒక్కో ప్రశ్నకు సమయం ఒకటిన్నర నిమిషం.
పార్ట్ A రాయడానికి ఉన్న సమయం 150ని.లు - మార్కులు 60
పార్ట్ A
మార్కులు - 60
సమయం - 165 ని.
ప్రశ్నపత్రం చదవడానికి 15ని.
జవాబులు రాయడానికి 150ని.
150÷60=2.5 కావున
1మార్కు సమాధానం రాయడానికి రెండున్నర నిమిషాల సమయం పడుతుంది.
అవగాహన - ప్రతిస్పందన (2.5ని.×20మా.=50ని.)
పరిచిత గద్యం 2.5ని.×5మా.=12.5ని.
పరిచిత పద్యం 2.5ని.×10మా.=25ని.
అపరిచిత గద్యం 2.5ని.×5మా.=12.5ని
వ్యక్తీకరణ-సృజనాత్మక (2.5ని.×40మా.=100ని.)
స్వీయ రచన (2.5ని.×33మా.=82.5ని.)
లఘు ప్రశ్నలు
4మార్కుల ప్రశ్నలు 3 రాయసలి
2.5×4మా.=10ని.
ఒక్కో ప్రశ్నకు 10ని.ల సమయం
వ్యాసరూప ప్రశ్నలు (
7మార్కుల ప్రశ్నలు 3 రాయాలి.
2.5ని.×7మా.=17.5ని.
ఒక్కో ప్రశ్నకు 17.5ని.
సృజనాత్మకత: ఒకే ప్రశ్న రాయాల్సి ఉంటుంది. 2.5ని.×7మా.=17.5ని.
ముఖ్యాంశాలు
- ప్రశ్నపత్రం పూర్తిగా చదవాలి.
- సమాధానం రాయగల ప్రశ్నలని ఎంపిక చేసుకోవాలి.
- అన్నింటికి సమాధానాలు వరుసక్రమంలో రాయడం మంచిది.
- ఛాయిస్ లు పోగా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి.
- ప్రశ్నను బట్టి మార్కులకు అనుగుణంగా సమాధానాలు రాయాలి.
- సమయ పాలన (సమయం సర్దుబాటు) చాలా ముఖ్యం.
- పరీక్ష హాలులో ప్రతీ క్షణం ఎంతో విలువైనది. సమయం వృధాచేయకూడదు.
- తెలుసు కదా అని వాబు ఎక్కువగా రాయకూడదు.
- సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
- హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉండాలి.
- ఉపవాచకం - రామాయణములో గల ఆరు కాండములలో ఏ కాండంలో కథ ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి.
- దానశీలము, వీరతెలంగాణ పాఠాలలో గల ఆరు పద్యాలను, భావాలను కంఠస్థం చేయాలి.
- కవి పరిచయం - గద్యభాగ పాఠ్యాంశాలు 2.ఎవరి భాష వవాళ్ళకు వినసొంపు, 6.భాగ్యోదయం, 8.లక్ష్యసిద్ది, 10.గోల్కొండ పట్టణం 12.భూమిక ఈ ఐదు పాఠాల కవిపరిచయాలు చదవాలి.పద్యభాగంలోని కవిపరిచయాలను కూడా చదవాలి.
- లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కరపత్రం, అభినందన పత్రం, కవితా రచన, గేయ రచన మొదలైన సృజనాత్మక అంశాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి.
- తొలగించినవి కాకుండా మిగిలిన 9పాఠాలలో గల అన్ని పదజాల అంశాలను చదవాలి.వీటితో పాటు పాఠ్యపుస్తకం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
- సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు. కర్తరీ, కర్మణీ వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన వచనం నుండి ఆధునిక వచనం లోకి మార్చడం మొదలైన వాటిని అభ్యసించాలి.
- అన్నింటికంటే ముఖ్యమైన పాఠ్యాంశ సారాంశాలు తెలిసివుండాలి. వాటిని రాయ ఆధారం చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు ఇవ్వాలి.
.......రాజేంద్ర (6302324734)