అర్థాలు
అంగన = స్త్రీ
అంబరం = వస్త్రం, ఆకాశం
అంతరాళం = లోపలి భాగం
అగ్రహారం = బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు
అనిదంపూర్వం = అపూర్వం, ఇంతకుముందు లేనిది
పూర్తిగా
అపూటం = పూర్తిగా
అఘరించు = నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం
కోరిక
అభిప్సితము = కోరిక
అభ్యాగతుడు = భోజన సమయమునకు వచ్చిన అతిథి
అర్ఘ్యపాద్యములు = పూజకొరకు, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు
అర్థి = యాచకుడు, అడుగువాడు
అలతి = కొద్ది
ఆకర్ణించు = విను
ఆచరణ = నడత
ఆర్థ్ర = తడిసిన
ఆశ = దిక్కు
ఆసరా = తోడు, సహాయం, అండ
ఇందుబింబం = చంద్రబింబం
ఇడుట = ఇచ్చుట
ఈవి = త్యాగం
ఉడుగు = నశించు
ఉద్దండ = గొప్ప, పొడవైన, ఎక్కువైన
ఉదాసీనత = నిర్లిప్తత
ఉద్ది = జత, జట్టు
ఉద్యమకారులు = మార్పుకోసం ప్రయత్నం చేసేవారు
ఉన్నతి = ప్రగతి
ఉపస్పర్శ = స్నాన ఆచమనాదులు
ఉపహారము = అల్పాహారం (టిఫిన్)
ఉమ్రావులు = ఉన్నత వంశీయులైన కళాపోషకులు
ఎచ్చుతచ్చులు = ఎక్కువ తక్కువలు
ఏకాగ్రత ఏపు = మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం
ఏపు = అతిశయం (ఎక్కువ), వికాసం
ఏరుతారు = భేదాలు
ఒక్క పచ్చరం ఒల్లదు = ఒకే దుప్పటి (అంతా సమానమనే అర్థంలో)
ఒల్లదు = గ్రహింపదు, ఇష్టపడదు
ఔదల = నడినెత్తి
కందెరుగని = కల్మషం తెలియని
కడగండ్లు = కష్టాలు, తిప్పలు
కమలానన = కమలమువంటి ముఖము కలది, స్త్రీ
కయ్య = కాలువ
కర్దమం = బురద, అడుసు
కల్లోలం = పెద్ద అల
కుటిలవాజి = కపటబుద్ధి కలవాడు, మోసగాడు
కుబ్జ = మరుగుజ్జు
కృపాణం =కత్తి, ఖడ్గం
కేళాకూళులు = క్రీడాసరస్సులు
కైవారము = చుట్టూరా, వంది స్తోత్రము
కొటారి = ఎత్తైన, చివరి
క్రతువు = యజ్ఞము
క్షేత్రం = స్థలము, పొలము
క్షోభ = కలత
గంభీరం = లోతైన
గర్జాట్టహాసం = గంభీరమైన ధ్వని
గరిశె = ధాన్యం భద్రపరిచే గది
గవిన్లు = గుహలు
గీతిక = చిన్నపాట
గుడిగెలు = గుళికలు, మందుబిళ్ళలు
గుమ్ములు = ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు
గుల్ల = ఖాళీ, చిన్న గంప
గోమయం ఆవుపెండ
గోముఖం = అలుకుట
చతురంతయానం = పల్లకి
చలువ జోల = చల్లని జోలపాట
చిత్తం = మనస్సు
చిత్తశుద్ది = స్వచ్ఛమైన మనస్సు
చిరుత గండు = మగచిరుత
చీరానీకం = వస్త్రముల సముదాయం
చుట్టుకుదురు = చుట్టబట్ట
చెవువారిచ్చు = శ్రద్ధగా విను
చేముట్టి = చేతిపిడికిలి
ఛత్రము = చత్రి, గొడుగు
ఛాత్రులు = విద్యార్థులు
జలజం = తామరపువ్వు
జలధి = సముద్రము
జాబు = ఉత్తరం
జిగి = కాంతి
జోదులు = యోధులు
డల్లు = పడిపోవు, చిక్కుకుపోవు
తండ్లాట = బాధపడుట
తటాకం = చెరువు
తప్పెట = డప్పు
తరళ = చంచలమైన
తావు = చోటు, జాగ
తీండ్రించు = ప్రకాశించు, ప్రజ్వలించు, మెలి పెట్టు, దువ్వు
తెరవ = స్త్రీ
తేజము = ప్రకాశం
దంష్ట్రలు = కోరలు, కోరపండ్లు
దపురం = నమోదు పుస్తకం
దయిత = భార్య
దస్తురుమాలు = భుజానవేసుకొనే కండువా
దవీయసి = దూరమైనది
దానవేంద్రుడు = రాక్షసరాజు
ద్వాఃకవాటం = ద్వారబంధం, తలుపు, దర్వాజా
దిగుడు = దీపపుగూడు, చిన్నగూడు
దుర్భరం =భరింపరానిది
ధూర్వహులు = భారమును మోసేవి, ఎడ్లు
దేవనది= ఆకాశగంగ
దేవిడీ = సంపన్నులు నివసించే పెద్ద భవంతి
దోయిలి = దోసిలి
ధృతి = ధైర్యం
నందనవనం = ఇంద్రుని ఉద్యానవనము
న దవీయసి = దూరం కానిది
నిగమాంతము = వేదాల చివర ఉన్నది (ఉపనిషత్తు)
నిరతము = ఎల్లప్పుడు
నిరయం = దుర్గతి, నరకం
నీవారం = ఒక విధమైన వరిధాన్యం
నుసలక = ఆలస్యంచేయక, వ్యతిరేకించక
పంచజనులు = పంచభూతముల వలన పుట్టినవారు (మనుషులు)
పక్షపాతము = ఒక పక్షము వహించుట
పణం = పందెం
పథం = తొవ్వ, మార్గం
పనుపు = నియోగించు
పరార్థులు = పరుల ప్రయోజనం కోరేవారు
పరివేష్టించి = చుట్టుకొని
పసందు = ఇష్టం
పసిడి చట్టువము = బంగారు గరిటె
పాలి పెర = గుర్తు, చిహ్నం, జాడ
ప్రాయం = వయసు
పుట్టి = ధాన్యాన్ని కొలిచే కొలత (సుమారు 8 క్వింటాళ్ళు)
పునర్నిర్మాణం = తిరిగి నిర్మించడం
పురంధ్రులు = ఇల్లండ్రు
పూడువాము = పింజర జాతికి చెందిన పాము
పేర్మి = ప్రేమ, గౌరవం
పొటాపతి = ఆకలిబాధ
పోషాకులు = (పెళ్ళి) బట్టలు
పౌరాణికుడు = పురాణము తెలిసినవాడు, చెప్పువాడు
ఫుల్లము = విచ్చుకున్నది
బంకులు = ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు
బండజింకలు = గబ్బిలాలు
బండారు = పసుపు
బాక = వాద్యవిశేషం
బుగులు = భయం
బురుజు = కోటను రక్షించే భటులు ఉండే ఎత్తైన నిర్మాణం
భరణం = జీతం
భాగీరథి = గంగ
భాసిల్లు = ప్రకాశించు
భూతము = ప్రాణి
మక్దూరు = నియమం
మచ్చకంటి = చేపలవంటి కన్నులు గల స్త్రీ, మీనాక్షి
మట్టసము = నిండినది
మత్తగంధేభం = మదజల సువాసనలుగల ఏనుగు
మధుకరము = ఇల్లిల్లు తిరిగి అన్నం సంపాదించుకోవడం
మరాళము = హంస
మల్లెవడి = తిరుగబడి
మహామారి = మశూచి, అమ్మతల్లి
మహారవము = పెద్ద చప్పుడు
మానితులు = గౌరవింపబడినవారు
మాను = చెట్టు
మాణవకుడు = బాలుడు, పిల్లవాడు
మిత్తి = మృత్యువు (చావు), వడ్డీ
ముచ్చెలు = చెప్పులు
ముష్టి = పిడికిలి
మెండు = ఎక్కువ, అధికం
మెరిమెణ = ఊరేగింపు (మెరిచ్చు)
మేన = పల్లకి (మ్యాన)
మోతెబరి = ధనిక రైతు
యశము = కీర్తి
యాదిజేసుకొను = గుర్తుకు తెచ్చుకొను
రివాజు = సంప్రదాయం
రేగడి = బంకమన్ను
రొద = చప్పుడు
రొంపి = బురద
లంఘించు = దూకు
లగెత్తు = పరుగెత్తు
లులితము = చలించునది, కదులునది
లేతీగబోడి = లేత తీగవంటి శరీరం
వక్ర్తము = ముఖం
వణిక్పుంగవులు = శ్రేష్ఠులైన వ్యాపారులు
వదాన్యుడు = దాత
వనజనేత్రి = తామరపూవులవంటి కన్నులు గల స్త్రీ
వర్షం = ఏడాది, సంవత్సరం
వర్ణి = బ్రహ్మచారి
వస = వాక్కును శుద్ధి చేసే ఔషధమూలిక
వసుధ = భూమి
వాంఛితము = కోరిక
వాఃపూరము = జలప్రవాహం
వాక్కులతో ప్రచురమైంది, సాహిత్యం
వాజ్రేయ = వజ్రతుల్యమైన
వాత్సల్యం = పుత్రాదులయందుగల స్నేహభావం
వారి = నీళ్ళు
వార్ధి = సముద్రం
విక్రమము = పరాక్రమము
విద్వత్తు = పాండిత్యం
విద్వాంసుడు = పండితుడు
విప్రగృహం = బ్రాహ్మణుల ఇల్లు
విభావళి = కాంతుల వరుస
వీడు = పట్టణం
వేడు = ఎవడు
వైజయంతి = విజయ చిహ్నము, విష్ణువు మెడలోని దండ
వైభాతికము = ప్రాతఃకాలానికి సంబంధించినది
శక్రధనుస్సు = సింగిడి, ఇంద్రధనుస్సు
శిలోంఛ ప్రక్రియలు = శిలాప్రక్రములు (పొలాల్లో రాలిన కంకుల - (గింజల)ను ఏరుకొని బ్రతికే వాళ్ళు) ఉంఛ ప్రక్రియలు (రోళ్ళ దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించేవాళ్ళు)
శేరు = ధాన్యమాన విశేషం (సుమారు 1 ¼ కిలోలు)
శౌరి = విష్ణువు
శ్రావణాభ్రము = శ్రావణమాసపు మేఘము
శ్రీకరము = మేలు కలిగించేది
సంధించుట = ఎక్కుపెట్టుట, కూర్చుట
సంబురాలు = వేడుకలు
సంయమి = ఇంద్రియములను జయించినవాడు
సంరంభం = వేగిరపాటు
సచివులు = మంత్రులు
సన్న = హస్తాదులచే చేసే సంజ్ఞ
సన్నిధానం = సమీపం, ఆశ్రయం
సరళీకృత = సులభతరంగా చేయబడిన
సవారి = వాహనం
సాళ్ళు = వరుసలు
సింపులు = పేలికలు (చింపులు)
సిత = తెల్లని
సీరపేండ్లు = మురికి బట్టల్లో పుట్టే క్రిములు
సూడిగములు = గాజులు, కడియములు
సొంపు = అందం
సౌదామని = మెరుపు
స్కంధం = కొమ్మ, భాగం
హాజర్ జవాబు = ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు
హర్మ్యము = ఎత్తైన మేడ
పర్యాయపదాలు
అండ - ఆసర, తోడు
అపూటం - పూర్తిగా, సంతానం
ఆలయం - ఇల్లు, గృహం
ఆశ - ఇచ్ఛ, ఈప్స, కాంక్ష
ఉన్నతి - వికాసం, అభివృద్ధి, ప్రగతి
కనకం - బంగారం, హేమ
కుత్తుక - గొంతు, మెడ
కోవెల - గుడి, దేవళం
కృపాణము - ఖడ్గము, కత్తి
చిత్తము - మనసు, హృదయం
జలధి - వార్ధి, సముద్రము
జలజము - పద్మము, కమలం
తారలు - నక్షత్రాలు, చుక్కలు
తొలి - మొదటి, ఆది
త్యాగం - ఈవి, ఈ
దిశ - దిక్కు కాష్ఠ
దేవాలయం - గుడి, కోవెల
పానుపు - పరుపు, పడక
పురాగ - మొత్తం, అంతా
పొంకంగ - సొంపుగా, అందంగా
పొలిమేర సరిహద్దు, ఎల్ల
పోరాటం - యుద్ధం, సంగ్రామం, సమరం
ప్రశంస - పొగడ్త, స్తోత్రం
బంగారం - పసిడి, పైడి, పుత్తడి
బాట - దారి, మార్గం
భండనము - యుద్ధము, రణము
భర్త - ధవుడు, నాథుడు, పతి, మగడు
భార్య - పత్ని, అర్ధాంగి, దయిత, దార, జయ
మిత్రుడు - స్నేహితుడు, చెలికాడు
వటువు - బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు
వర్షము - సంవత్సరము, సంవత్సరము
విప్రుడు - బ్రాహ్మణుడు, భూసురుడు
విషాదం - బాధ, దుఃఖం
విష్ణువు - నారాయణుడు, కేశవుడు, దామోదరుడు
వెచ్చించు - ఖర్చుచేయు, వినియోగించు
వెన్నెల = జ్యోత్స్న, కౌముది, చంద్రిక
వేదండము = ఏనుగు, కరి, గజము
సంబురం - సంతోషం, ఆనందం
సొంపు - సోయగం, అందం
సంస్కరణ - బాగుచేయడం, చెడును రూపుమాపడం
హాటకం - బంగారం, హొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, కనకం
నానార్థాలు
అంబరం = వస్త్రం, ఆకాశం
ఆశ = కోరిక, దిక్కు
కనకం = బంగారం, ఉమ్మెత్త, సంపెంగ
కవి = కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి
కులము = వంశం, జాతి, శరీరం, ఇల్లు
గురువు = ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది
ఘనము = మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి
చిత్రము = అద్భుతరసం, ఆశ్చర్యం, చిత్తరువు (బొమ్మ), పదచమత్కారం
జీవనము = బ్రతుకు, నీళ్ళు, గాలి, ప్రాణం
పణం = పందెం, కూలి, వెల, ధనం
పేరు = నామధేయం, కీర్తి, అధికం, హారం
బాష్పము = కన్నీరు, ఆవిరి, ఇనుము
బుధుడు = పండితుడు, బుధ గ్రహం, బుద్ధిమంతుడు
భీముడు = ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు
మిత్రుడు = సూర్యుడు, స్నేహితుడు
రాజు = ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు
వర్షము = వాన, సంవత్సరం, దేశం
సాహిత్యము = కలయిక, వాజ్మయం
సిరి = సంపద, లక్ష్మి
స్కంధము = కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం
హరి = విష్ణువు, ఇంద్రుడు, గుఱ్ఱం, దొంగ, సింహం, కోతి
క్షేత్రము = చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం
వ్యుత్పత్త్యర్థములు
కృపాణం = దయను పోగొట్టునది - కత్తి
గురువు = అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు - ఉపాధ్యాయుడు
జలధి = జలములు దీనిచే ధరింపబడును - సముద్రము
త్రివిక్రముడు = ముల్లోకములను ఆక్రమించినవాడు - విష్ణువు
దాశరథి = దశరథుని పుత్రుడు - శ్రీరాముడు
నగరం = కొండలవలే ఉండే పెద్ద పెద్ద భవనములు కలది - పట్టణం
నీరజ భవుడు = (విష్ణువు నాభి) కమలమునందు పుట్టినవాడు - బ్రహ్మ
పరాశర్యుడు = రాశరమహర్షి కుమారుడు - వ్యాసుడు
భవాని = భవుని భార్య - పార్వతి
భాగీరథి = భగీరథునిచే తీసుకొనిరాబడినది - గంగ
భానువు = ప్రకాశించువాడు - సూర్యుడు
భాష = భాషింపబడునది - మాట
ముని = మౌనంగా ఉండేవాడే - ఋషి
వసుధ = బంగారమును గర్భమందు కలది - భూమి
విష్ణువు = విశ్వమంతటా వ్యాపించి యుండువాడు - విష్ణుమూర్తి
హరుడు = ప్రళయకాలమున సర్వమును హరించువాడు - శివుడు
ప్రకృతి వికృతులు
ఆధారం - ఆదరువు
ఆజ్ఞ - ఆన
ఆశ్చర్యం - అచ్చెరువు
కథ - కథ
కవిత - కైత
కార్యం - కర్జం
కావ్యం - కబ్బం
దిశ - దేశ
ప్రయాణం - పయనం
భాష - బాస
మృత్యువు - మిత్తి
యోధులు - జోదులు
యజ్ఞం - జన్నం
విద్య - విద్దె
శిఖ - సిగ
శక్తి - సత్తి
సముద్రము - సంద్రము
సహజం - సాజం
స్తంభము - కంబము
హృదయం - ఎద