మానవత్వాన్ని బ్రతికిద్దాం

మానవత్వాన్ని బ్రతికిద్దాం

మానవత్వాన్ని బ్రతికిద్దాం

మానవత్వమే దేశ భవితకు పునాది
నేడు మానవత్వం‌ మచ్చుకైనా కానరాదు
ఎటు చూసినా‌‌‌‌ హింసాత్మక సంఘటనలు
కక్షలు‌ కార్పణ్యాలు పగలు
ప్రతీకారాలు
మానవత్వం లేని మనుషులు
కారణాలు అనేకం
ఆస్తుల తగాదాలు రక్త సంబంధం
మరిచి  మానవత్వం విడిచి
ప్రాణాలు తీస్తున్న దారుణాలు
మానవత్వం మరిచి‌న మృగాల
వేటలో పసి వారిని సైతం 
వేటాడి వెంటాడి ఆయువును
తీసే కిరాతకులు
ధన దాహంతో ప్రాణ స్నేహితులను
హతమారుస్తున్న దుర్మార్గులు
దేశాల మధ్య ఉగ్ర‌వాదం పడగవిప్పిన వేళ భద్రత లేని
సరిహద్దలను‌ కాపాడే వీర జవాన్ లు కుటుంబాలను‌ వదిలి తమ
చివరి రక్తపు బొట్టును కూడా
దేశానికి అర్పిస్తున్న‌వేళ
మన దేశం శాంతి సహనం
సౌభ్రాతృత్వం ప్రపంచ‌ శాంతి
ఆయుధాలుగా  ప్రపంచ దేశాలతో
గౌరవం పొందుతున్న వేళ
మానవత్వమా నీ వెక్కడ‌ అని
దేశ ప్రజలలోని అభద్రత భావానికి
ముగింపు పలికే రోజు రావాలి
వస్తుంది పరివర్తన రావాలి
ఆనందం వెల్లి విరియాలి

పేరు:సుధారాణి కృష్ణంరాజు
ఊరు:బడంగ్ పేట
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

0/Post a Comment/Comments