మేలిమి బంగారాలున్నాయి

మేలిమి బంగారాలున్నాయి

మేలిమి బంగారాలున్నాయి

ఈ సమాజంలో
మదిన మంట రగిల్చే
కసి కన్నులు చూస్తుంటాయి ...!
చూపుల నిప్పులతో
భస్మంచేసే  కర్కశ హృదయాలున్నాయి....!
మంచితనపు మాటలలో
తేనెపూసిన చురకత్తులున్నాయి...!
నమ్మిన ఆదైవం 
ఎక్కడ వరాలు ఇచ్చేస్తాడో అని భయపడే
శత్రుమూకలున్నాయి...!
సహించలేని ఎదతో
ఓర్వలేక ఓండ్రబెట్టే నక్కలున్నాయి...!
నమ్మలేని నిజాన్ని చూసి
తట్టుకోలేక పళ్ళుకొరికే
పిరికి పిల్లులున్నాయి...!
కాని
స్వచ్ఛమైన మనసు
నిశ్చల ఆనందాన్ని ఇస్తుంది...!
ఉన్నతమైన హృదయం
ప్రభంధ బోధనం చేస్తుంది...!
పలికే పలుకులు
వేదవాదమై చరిస్తాయి..!
ఆనందింపచేసే ప్రకృతి
మనసును కరిగింపచేసే సృష్టి ఆకృతి
నవజాతరలా పులకింపచేసే
రస వీచికలు చాలవా...!
యెాగానికి- భావరాగానికి... అని ఎలాతెలుస్తుంది
ఇక్కడ
కష్టాల కొలిమినుండి
మెరిసిన కొన్ని మెలిమి బంగారాలున్నాయని
ఎలా అర్దమవుతుంది ఈ సంఘానికి

రచన
డా!! బాలాజీ దీక్షితులు పి.వి
8885391722

0/Post a Comment/Comments