శ్రీ శ్రీ కళా వేదిక వారి ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు కవితోత్సవం వరల్డ్ రికార్డ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం బుద్ధాల కన్వెన్షన్ హాల్ లో తేదీ: 12, 13 తేదీలలో 24గంటలు, 24నిమిషాలు, 24సెకన్ల కవి సమ్మేళనం లో కవి రచయిత విశ్లేషకుడు ఉపాధ్యాయుడు కొంపెల్లి రామయ్య పాల్గొని తన కవితా గానంతో అందరినీ అలరించినందుకుగాను భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్ నేషనల్ మార్వెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్,మరియు తానా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు ఐనట్లు కవి రామయ్య తెలిపారు. ఇందుకు గాను నిర్వాహకులు శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ డా.కత్తి మండ ప్రతాప్ , కొల్లి రమాదేవి తదితరులు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక ప్రశంసాపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా వికాస వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాధనాల వేంకట స్వామి నాయుడు, లెనిన్ శ్రీనివాస్ గార్లు మరియు బుక్కా సత్యనారాయణ , మలిశెట్టి కృష్ణ మూర్తి,గాజుల భారతి శ్రీనివాస్,యడవల్లి శైలజ శ్రీనివాస్, తాళ్ళ యోగానందం,ఆంగోతు జయ వాసు, ఉరిమళ్ళ సునంద, ఎం డి జహిరోద్ధిన్,భూక్యా హచ్యా,మద్దం రమణ , కొత్తపల్లి కృష్ణారావు,రెళ్ళ శ్రీనివాస్,చిన హుసేన్, సీత్లనాయక్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు తదితర మిత్రులు రామయ్యను అభినందించారు.