కవిత్వమే అతని ప్రాణం ఊపిరి
కవి గాంచని చోట రవిగాంచును అనే నానుడి ప్రాచుర్యంలో ఉంది.కవి అంటే కనిపించేవే కాదు వినిపుంచేవే కాదు .కవి కళ్ళ తో చూడగలడు హృదయం చూడగలరు
ప్రపంచ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ వైద్య.ఉమశేషారావు అదే కోవలోకి వస్తారు.
ఆయన చదివింది రాజనీతి శాస్త్ర 0 బోధించేది రాజనీతి శాస్త్రం అయినప్పటికీ నిత్యం సామాజిక అంశాలపై కవితలు రాయడం ,కవిత రాయని రోజు లేకుండా ప్రతి రోజు ఏదో అంశంపై వచన కవితలు రాయడం ఊపిరిగా సాగుతున్నారు
కళాశాల స్థాయి నుండి ప్రారంభం అయిన ఈ ఆసక్తి అనురక్తి గా మరి చినుకు చినుకు నీళ్లు గా మరి కవిత్వం ఊపిరిగా మరి జీవిత చారమాంకం వరకు కొనసాగుతుంది అనే విశ్వాస0 కవిలో కనిపించింది
లాక్ డౌన్ లో కూడా కరోనా పై చైతన్యం కల్పిస్తూ కవితలు రాసినారు.
అక్షరాలు అస్త్రాలుగా చేసుకొని మార్పు తపన పడుతూ షీ టీం,స్పందన,ఎన్నికల ముచ్చట్లు ,వయోజన విద్యా పై నాటికలు రాసినారు.
తెలుగు వెలుగు,ప్రతి వాట్సాప్ గ్రూప్ లోను, ము ఖ చిత్రం లోను నిరంతరము కవితలు రాయడం ఒక వృత్తిగా మార్చుకున్నారు.
పర్యావరణం,నీటి ప్రాముఖ్యత, అక్షరాస్యత,ఇంకుడు గుంతలు,హరితహారం, స్త్రీల సమస్యల పై కవితలు ,ఉక్రెయిన్ యుద్ధం,మానవ హక్కులు ప్రతి అంశంపై కవితలు రాస్తూనే ఉన్నారు
కలం తో నేస్తం చేయడమే కాకుండా జీవిత భాగస్వామి ని సాహిత్య0 లో ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
200 పై చిలుకు ప్రశ0సా పాత్రలు,సన్మానాలు,అవార్డులు పొందినారు.
తెలంగాణ జాగృతి నిర్వహించి న కవితల పోటీల్లో మరియ హితసాహితి,జాతీయ సాహిత్య పరిషద్,తెరవే,తెరసం, మంజీర కళాపీఠం,ఉట్నూరు సాహితి వేదిక దర్పణం వంటి అనేక సాహితి సంస్థల సమూహాల్లో సభ్యుడు ఆ సంస్థల కార్యనిర్వహణలో పాల్గొంటూ కవితలు రాస్తున్నారు
నా తెలంగాణ తెలుగు అనే అంశం పై తన అవ్వ బాషా అయ్యా బాషా పై ప్రేమను ఉద్వేగాన్ని వ్యక్తం చేసినారు.
హితన్ని కోరేవాడే కవి సమాజ హితం కోసం తన ఆరాటం మరియు ఉబలాటం
శ్రీ శ్రీ అన్నట్టు కవితకు ఏది అనర్హ0 కాదన్నట్లు ప్రత్యేక అంశాల పై కవితాత్మకంగా స్పందించే తత్వం కవి సహజ లక్షణం.
ప్రపంచ తెలుగు మహాసభలు పాల్గొనడం నుంచి కవిత ఒక పిచ్చిగా ఎక్కడ సాహిత్య సమావేశాలు జరిగిన వాలిపోవడం జరిగింది.బిసుర కవుల వనం ద్వారా ప్రపంచ కవిత దినోత్సవం పురస్కరి0చుకొని రాసిన కవితలు,హోళీ సందర్బంగా రాసిన కవితల్లో విజేతలుగా నిల్చినారు.
ఆయన మాటల్లో కవి ఆ0టే
కవి
కనిపించేవి
వినిపించేవే కాదు
కనిపించని వినిపించని
వాటిని తన హృదయం తో చూడగలడు
ఒక లక్ష్యం కోసం కలం
తో సమాజ క్షేత్రం లో
ప్రజా పక్షమే అతని నైజాం
భయం లేదు భావన తప్ప
అక్షరాలు పిరంగులుగా
అక్రమాల పై పేల్చగలడు
హృదయ తన్మయత్వం లో
తనకు తానే సాటి
అచ్చు అయిన కవిత చూసి
జీవితం లో ఏదో పొందిన అనుభూతి
ఎండల్లో వాన
వానలో ఎండ
ఎడారి లో మంచు
గుండెలను పిండి చేయగలడు
హాస్యం తో అయుష్షు పోయాగలడు
దేశ నిర్మాణం లో అయిన పునాదీ
సృజనలో మేటి
మాటలో వాగ్ధాటి
ఆయన కులం అక్షారం
ఆయన ప్రాణం మానవత్వం
సమసమాజమే హితం
కొందరి దృష్టి లో అది పిచ్చి
కానీ అతనికి అంతరనుభూతి
కవి కలం తో వికాసం కోసం
ఆరాట పడే హృది
అగ్గిపుల్ల నుంచి
ఆకాశం వరకు
గల్లీ నుంచి విశ్వం వరకు
అన్ని0టి నుంచి కవిత వస్తువును
ఎంపిక చేసుకొనే దిట్ట