సంశ్లేషాక్షర ఒత్తుల గేయం
-------------------------------------
దుర్వ్యసనాలు మానాలి
ఈర్ష్యా గుణం పోవాలి
అస్పృశ్యతను వీడాలి
స్త్రీలను గౌరవించాలి
స్థైర్యము కల్గియుండాలి
ప్రాశస్త్యము పొందాలి
సత్ప్రవర్తన ఉండాలి
సామర్థ్యము చాటాలి
ఉద్గ్రంధం చదవాలి
లక్ష్మణ భక్తి చూపాలి
ఊర్ధ్వలోక నాథుని
అష్టైశ్వర్యాలొందాలి
రాష్ట్రం కోసం నిలవాలి
ఉజ్జ్వలంగా వెలగాలి
శాస్త్రాన్ని నమ్మాలి
జ్యోత్న్సలా మారాలి
ఆర్ద్రత ఉపయుక్తం
ఉత్ప్రేక్ష అలంకారం
దారిద్య్రం అంధకారం
ఉచ్చ్వాసము అవసరం
దేవుని మహత్మ్యం చూడుము
దుర్వ్యయమిక మానుము
నిష్ప్రయోజనం ఎరుగుము
వస్త్రం, అస్త్రం అతిముఖ్యము
-గద్వాల సోమన్న,
ఎమ్మిగనూరు.