తడి ఆరినా....
తడి ఆరనీ.....
ఇంపైన నీ మేనియంతయు ఔషధమే...
చల్లని పిల్లగాలిలో చేరిన నీ పరిమళాలు చాలు
ఉదరకోశమెంతో హాయిగా ఉండదా....
పదార్థమేదైతేనేమి
నీదంటూ ప్రత్యేకమైన ముద్దరతో ఊరించి
చిటపటలాడిన మరుక్షణమే
ప్రతి మదినంతా నీవైపే తిప్పుకునెదవు కదా...
మధుమేహమైన..రక్తపోటైన..
నిగనిగలతో మెరిసే నిన్ను తాకితే చాలు
ఆమడ దూరం పరుగెత్తును కదా..
నల్లని నిగనిగల కురులకు
చిరునామా నీవైనా నిలువెల్లా ఆరోగ్యమందిచే అమృతప్రదాయినిగా
శ్రీనివాసుని అలకకు కారణమైనా
శ్రీలక్ష్మీ మెచ్చిన సిరివి కదా...
నిత్యపచ్చదనమా..
నిండైన కమ్మదనమా..
అమ్మతనంతోటి పోటీపడే ఇంటి కల్పవృక్షమా కర్రీలో నిండుదనమా...
ఇల్లుతీరు పందిరి తల్లితీరు పిల్లలాగ..
నువ్వున్న వంటతీరే వేరాయే...
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*