యువతకు స్ఫూర్తి
మన భారత దేశ ఘన కీర్తిని ఖంఢాంతరాలకు
చాటి చెప్పినమహనీయుడు
స్వామి వివేకానందుడు
తరము ఏదైనా వివేకా నందుని
సూక్తులు ప్రతి వ్యక్తి జీవితంలో
తప్పక ఆచరించ వలసిన జీవన
సోపానాలు
ముఖ్యంగా యువత భవితకు
ఆదర్శాలు వారి సందేశాలు
గొప్పగా జీవించాలంటే కఠిన
పరీక్షలు దాటవలసి ఉంటుంది
జీవితంలో ఆశయం అంటూ లేని
వారు కాని డబ్బు లేని వారు కాదు
పేదలు అని యువతలో స్పూర్తిని
నింపారు
వెనక ముందు ఏముంది
అని ఆలోచించే దానికన్నా
మీలో ఏముందో వెలికి తీసినపుడు
యువత బంగారు భవితకు మీలోని
మేధస్సు పునాది అవుతుంది
అదే దేశ ప్రగతికి సోపానం
నేటి యువతే రేపటి భవిత
వివేకా నందుని సందేశము
యువతను సన్మార్గంలో నడిపించ
డానికి యువత తమ ఆశయాలను
సాధించుకోవడానికి స్పూర్తిని నింపే
సందేశాలు
పేరు: సుధారాణి కృష్ణంరాజు
ఊరు: బడంగ్ పేట