ధ్యాన సాధన-అనుభవాలు. (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యాన సాధన-అనుభవాలు. (వ్యాసం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

ధ్యానసాధన -అనుభవాలు
----------₹₹₹₹₹------------------
మనం ఆనందంగా జీవించాలంటే, మన జన్మలను సార్థకత చేసుకోవాలంటే అత్యంత ముఖ్యమైన ( 4) నాలుగు విషయాలు ధ్యాన సాధన చేసి అనుభవపూర్వకంగా ముందు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే
1). అసలు మనం ఎవరము?
2). ఈ భూమి మీద  జన్మించక ముందు మనం ఎక్కడ ఉన్నాము?
3). మనం ఈ భూమిపై జన్మ తీసుకోవడానికి గల కారణం ఏమిటి?
4). మనం చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి పోతాము?
       పై నాలుగు విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కానీ మనం ధ్యానం చేయాలంటే ప్రప్రథమంగా మన యొక్క ఆత్మ కనీసం ఎన్నో జన్మల తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు మనం మన ధ్యానం గురించి అసలు ఇష్టపడము. అప్పటివరకు ప్రాపంచిక జీవితంలో పూర్తిస్థాయిలో మునిగితేలుతూ మాయలో పడిపోతే అనేక సమస్యలతో సతమతమవుతూ జీవిస్తూ ఉంటాము. మరి ఈ మాయను జీవించాలంటే " ధ్యాన" సాధన అన్నది తప్పనిసరి.
           మన ధ్యానం అనుభవాలు
"అనాపానసతి"ద్వారా శ్వాస మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లి మెల్లిగా ఆలోచనలన్నీ శూన్య మై
 పోయినప్పుడు, ధ్యానానుభవాలు మనలో మొదలవుతాయి. అవి ( 7) రకాలు.

1).శరీరం తేలిక కావడం
-----------------------------------
ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే, ముందు శరీరం బాగా  తేలిక అయిపోతుంది. శరీరం అసలు ఉందో లేదో అన్నట్లుగా మనకు దాని బరువు దాని బరువుఅనిపిస్తుంది. శరీరం తేలిక కావడం అంటే మనం ఈ స్తూల శరీరం నుండి బయటికి వచ్చాము అన్నమాట. కనుకనే దాని బరువు మనకు తెలియడం లేదు.
2). శరీరం బరువుగా అయిపోవడం-
----------------------
ధ్యానంలో ఉండగా తల భాగం కానీ, శరీరంలోని ఏ ఇతర భాగం కాని ఒక ఒక" గ్రానైట్ రాయి"లాగ బరువుగా అయిపోతుంది. శరీరం బరువుగా ఉంది అంటే "ఒక స్పంజ్ ను నీళ్లలో పడేస్తే ఆస్పంజ్ నీళ్లను పీల్చుకుని బరువుగా అయినట్లు "మనం"మన శరీరంలోని ఉంటూ కాస్మిక్ ఎనర్జీని లోపలికి బాగా గ్రహించమని అర్థం.
3). రకరకాల రంగులు కనబడతాయి......... చిత్రవిచిత్రాలైన రంగులు, అంతకుముందు ఎప్పుడు చూడని అద్భుతమైన రంగులు మన ఫాల భాగంలో మనకు కనబడతాయి. కళ్ళు రెండూ మూసుకున్నప్పుడు మనలోనే శక్తి అంతా మన యొక్క ఫాల భాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడవ కన్ను యైన దివ్యచక్షువు ను ఉత్తేజం చేస్తుంది.
4). శరీరంలోని అన్ని భాగాలలో...... ముఖ్యంగా వెన్ను భాగంలో నొప్పులు వస్తాయి.
----------------------------------------
ఎప్పుడైతే రెండు కళ్ళు మూసుకుంటామో శ్వాస మీద ధ్యాస పెడదామో, మనసును ఎప్పుడైతే శూన్యం చేస్తామో... అప్పుడు అపారమైన విశ్వ మయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంటుంది. ఆ విశ్వశక్తి ప్రవాహంలో లో మన యొక్క అపరిశుభ్రమైన నాడీ మండలం పరిశుభ్రం అవుతుంటుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తాయి.ఆ నొప్పులు భరించాలి. అయితే ఒకానొక పరిశుద్ధ ఆత్మగల మిత్తి ధ్యానంలో కూర్చుంటే ఏ విధమైన నొప్పులు రావు. నాడీ మండలం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి. ఈ నొప్పులన్ని మనం ధ్యానంలో ఉన్నంతసేపు మాత్రమే ఉంటాయి. ధ్యానం నుండి ఇ లేవగానే నొప్పులు మాయం అవుతాయి.
5). లోపల మరొక శరీరం ఉంది------ఇది రకరకాల విన్యాసాలను చేస్తుంది. ధ్యానస్థితిలో విశ్వశక్తిని అధికంగా తీసుకోవడం వలన లోపల ఉన్న సూక్ష్మ శరీరం మన స్థూలదేహం నుండి విడివడుటకు ప్రయత్నిస్తోంది. ముందుకు వెనకకు ఊగుతుంటుంది. ఆ అనుభవం మనకు తెలుస్తుంది. అలా అలా తిరిగి తిరిగి అపకేంద్ర బలాన్ని ఆపాదించు కుంటుంది.

6). గాలిలో పక్షిలా ఎగిరే అనుభవం----------------సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయటికి వచ్చి ఎక్కడికో వెళ్లిపోయి నట్లు మనకు అనుభవం అవుతుంది. ఎక్కడో గాలిలో ఎగిరి పోతున్నా పక్షిలా, మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న ట్లు అనుభవం కలుగుతుంది.

7). విచ్చుకునే దివ్యచక్షువు
--------------------------------------
చిట్ట చివరి దశలో మనలోని దివ్యచక్షువు తెరుచుకుంటుంది. టీవీని ఆన్ చేసి ఏదో ఒక చానల్ ను పట్టుకున్నట్లు, మూడవ కన్ను నేర్చుకున్న తర్వాత అది మొట్టమొదట ముఖ్యంగా "డిస్కవరీ"చానల్ పట్టుకుంటుంది. అనేక కొండలు, లోయలు, జలపాతాలు, అన్నింటిని చక్కగా చూస్తాము. అందులో లీనమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాం. అక్కడినుంచి మనకు అనంత శక్తి లభిస్తుంది.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments