*సూర్యనమస్కార మంత్రములు* రథసప్తమిప్రాతఃకాల సమయమందు ఆరోగ్యమాయుష్య సంపదలుపెరుగుటకు*ఛాయా-ఉషా సమేతశ్రీసూర్యనారాయణుని అనుగ్రహంకొరకు ఈ12మంత్రములను జపించాలి. (వీలైతే ఒక్కొక్కటి పన్నెండు సార్లు చేస్తే మంచిది) మరియుదోసిట్లో నీళ్లుతీసుకుని,12మార్లు సూర్యునికి అర్ఘ్యం వదలాలి. 1)మిత్రాయ నమః 2)రవయే నమః 3)సూర్యాయనమః 4)భానవే నమః 5)ఖగాకాయనమః 6)పూష్ణే నమః 7)హిరణ్యగర్భాయనమః 8)మరీచయేనమః 9)ఆదిత్యాయ నమః 10)సవిత్రే నమః 11)అర్కాయనమః12)భాస్కరాయ నమః *ద్వాదశాదిత్యేభ్యోనమః* సాష్టాంగనమస్కారాన్-సమర్పయామి. (అని చివరికి చెప్పాలి) గరిక-ఎర్ర పూలు-జిల్లేడు పూలు-జిల్లేడా కు,వీలైతేసూర్యునికి సమర్పించాలి. (శివపంచాయతనంలో సూర్యుడు ఆగ్నేయంలో ఉంటాడు. లేదా నవగ్రహాలమధ్యలోఉంటాడు) గోధుమ రవ్వతోచేసినపాయసంనివేదించాలి.అదిప్రసాదంగాస్వీకరించాలి. ఆరోగ్యం కొరకు ఎరుపు జాకెట్ బట్ట గోధుమలు/లేదాగోధుమ రవ్వ/లేదాఉప్మా రవ్వ- తాంబూలం- దక్షిణదానం చేస్తే మంచిది.అంతా శుభంజరుగును. ఇదంతాచాలా సులభమైన అనుష్ఠానం. విశేషంగాచేయించుకోవాలంటే 1)అరుణ పారాయణం. 2)వేదఅరుణమంత్రములతోసూర్యనమస్కారాలు. 3)త్రిచఅర్ఘ్యములు4)అభిషేకవిశేషపూజ.
ఉమశేషారావు
లింగాపూర్
కామారెడ్డి