వావిలాల పాఠశాలలో ప్రారంభమైన"రీడ్" కార్యక్రమం

వావిలాల పాఠశాలలో ప్రారంభమైన"రీడ్" కార్యక్రమం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 02, 2022 న  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన "చదువు-ఆనందించు-అభివృద్ధిచెందు" (Read Enjoy and Develop - READ) కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - వావిలాలలో ఘనంగా ప్రారంభమైంది. సరస్వతీ మాత అవతరించిన సుదినమైన "శ్రీపంచమి" రోజున పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ దుబాసి జ్ఞాన సుధాకర్ గారు 9 వ తరగతి విద్యార్థులతో "తెలుగు-హిందీ-ఇంగ్లీషు" వాచకాలలోని పాఠాలను ప్రకాశపఠనం చేయించి లాంఛనంగా ప్రారంభించారు. కె ఆదిత్య -తెలుగు, ఆర్ సుస్మిత-హిందీ, సిహెచ్ శ్రీరామ్ - ఇంగ్లీషు పాఠాలు ప్రకాశపఠనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రంథాలయం ఇంఛార్జి ఉపాధ్యాయిని శ్రీమతి టి జ్యోతిప్రభ, చంద్రకిరణ్, వెంకట్రాజయ్య,  చంద్రశేఖర్, సునీత, బాలమణి, జయరామ్, అడిగొప్పుల సదయ్య, రాయమల్లయ్య,శ్రీను ఉపాధ్యాయులు, సి.ఆర్పీ మహేందర్ పాల్గొన్నారు.


0/Post a Comment/Comments