"చ" ఒత్తు గేయం--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చ" ఒత్తు గేయం--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

"చ" ఒత్తు గేయం
--------------------------------------
మచ్చల ఆవు వచ్చింది
పచ్చిక కొంత మేసింది
ముచ్చట వేసి వెళ్ళితే!
అచ్చట నుండి కదిలింది

పచ్చపచ్చని పచ్చికపై
పిచ్చుక ఒకటి వాలింది
లచ్చిమి పాప చూసింది
అచ్చెరువు తానొందింది

నిచ్చెనపై అన్నయ్య
వెచ్చని అమ్మ ఒడిలో
అచ్చర చిట్టి కూర్చుంది
పుచ్చకాయ  తింటానంది

రచ్చబండపై తాతయ్య
గచ్చునేలపై జనులు
అర్చన బుజ్జి  వచ్చింది
కుచ్చుల జడ ఊపింది
--గద్వాల సోమన్న  ,
గణితోపాధ్యాయుడు. 

0/Post a Comment/Comments