స్వచ్ఛత
ఆయన స్వచ్ఛతకు మారుపేరు
ఆయన త్యాగమయి
సంచార జీవి
ఊరు ఊరు తిరిగి
పరిశుభ్రతను నేర్పి
స్వయంగా చీపురు పట్టి ఊడ్చిన సంత్ గాడ్గే
పూలే తర్వాత సమానత్వం
సాధన కోసం ఊపిరిగా
బతికిన జీవి
కులవ్యవస్థ నిర్ములనకోసం
మూఢ నమ్మకాలను
అచేతనం లో ఉన్న బడుగులను
తనకీర్తనాల ద్వారా చేతనం
చేసిన కర్మాజీవి
దేవునికి కనుకలు కాదు
దేవుడు మనకు ఇవ్వాలి
అని మానవ సంక్షేమమే
దైవ కళ్యాణం అని నిర్ధారించిన
యోగిపుంగవుడు
కుటుంబాన్ని దూరంగా ఉంచి
సంస్థల నిర్వహణలో
నికిచ్చిగా నిర్వహించిన సత్యశోధకుడు
బౌద్ధభిక్షావుగా భిక్షాటన చేసిన
జీవి
రజక కులం లో పుట్టి
రజక కులస్తులు బాధలను
అనుభవించి
మహారాష్ట్రలో పుట్టిన మరో
ఆణి ముత్యం
ఉత్పత్తి కులాలు సైతం
సంస్కర్త గురించి మర్చిపోవడం
హీనం హీనం
ప్రభ మిత్రుడు అంబేద్కర్
మరణం తట్టుకోలేక
14 రోజుల్లోనే మరణించిన
గాడ్గే బాబా నేటితరనికి
ఎందరికి తెలుసు
చరిత్రపురుషుల జీవితాలు
ఎరుక చెయ్యాలి
అది బాధ్యత ఆయన ఆశయాల బతికిద్దాం
కులరాహిత సమాజాన్ని
తొలిగించే వైపు అడుగులు
వేద్దాం గాడ్గే బాబా ఒక సన్యాసి
కాదు ఆయన సమనత్వ కాంక్ష
పిపాసి
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ