" ఆకాంక్ష "
-----------------------------------
వానలు మెండుగ కురియాలి
వాగులు,వంకలు పారాలి
చెరువులు కళకళలాడాలి
కరువులు భువిలో పోవాలి
పంటలు బాగా పండాలి
అప్పులు మొత్తం తీర్చాలి
రైతులు చల్లంగుండాలి
బ్రతుకులు వెన్నెల కావాలి
వానలు వేళకు రావాలి
మనుషుల దాహం తీరాలి
తరువులు పచ్చగ మారాలి
ఫలములు విరివిగ కాయాలి
మొక్కలు చాలా నాటాలి
తరువులు పుడమిని పెంచాలి
వానలు నేలను తదపాలి
సస్యశ్యామలమవ్వాలి
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.
-----------------------------------
వానలు మెండుగ కురియాలి
వాగులు,వంకలు పారాలి
చెరువులు కళకళలాడాలి
కరువులు భువిలో పోవాలి
పంటలు బాగా పండాలి
అప్పులు మొత్తం తీర్చాలి
రైతులు చల్లంగుండాలి
బ్రతుకులు వెన్నెల కావాలి
వానలు వేళకు రావాలి
మనుషుల దాహం తీరాలి
తరువులు పచ్చగ మారాలి
ఫలములు విరివిగ కాయాలి
మొక్కలు చాలా నాటాలి
తరువులు పుడమిని పెంచాలి
వానలు నేలను తదపాలి
సస్యశ్యామలమవ్వాలి
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.