మనబడి
పరుగు పరుగున
ప్రార్థన సమయానికి వెళ్ళి
మనమే తాళాలు తీసుకుని
మనమే ఊడ్చుకుని
మనమే బెల్ కొట్టుకుని
మనమే చెట్లకు నీళ్ళుపోసుకుని
మన డ్యూటీ మనకెలాగూ ఉంటది
ఆర్.ఏ., ఓ.ఎస్.,
స్కావెంజర్ పనులు కూడా
చకచకా కానిచ్చి
తిరిగి తాళాలేసి
తాపీగా బయలుదేరుదాం
ఎందుకంటే ఇది మనబడి
దేశ భవిష్యత్తును మార్చే
చదువుల ఒడి
గురువును బోధనకు తప్ప
అన్ని పనులకు
చేరువ చేస్తున్న గుడి
---రాజేంద్ర
24 గంటలు సర్వీస్ చేస్తున్నాము, చదువు చెప్పడం తక్కువ... గొడ్డు చాకిరీ ఎక్కువ ( unnecessary..works). ఈ విషయంలో ప్రభుత్వానిది దృతరాష్ట్రుని పాలనగా అనిపిస్తుంది