నా తొలిప్రేమ . (కవిత). గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ .9491387977.

నా తొలిప్రేమ . (కవిత). గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ .9491387977.

నా తొలిప్రేమ (కవిత)
-----------------------------
కలువల కన్నులలోన
కురిసెను వెన్నెల వాన
రెండు తనువులు తడిసే
మెండుగ మది ఇక మురిసే!

నిను చూసిన తొలిచూపులోనే
పుట్టెనుగా నీపై అంతులేని ప్రేమ
ఇక చూడకుండ ఉండలేను భామ
నా మది దోచిన కలువ కన్నులలేమ

నీ తొలిచూపే మన ప్రేమకు నాంది
నీ మలిచూపుతో అయ్యాను బంధి ఇద్ధరి మధ్య మొదలాయే ప్రేమయుధ్ధం
మన శాశ్వత ప్రేమకు ఔదాం ఇక సన్నద్ధం !

నీ చూపుల తూపులలో చిక్కాను నేను
నిను చూడకుండ ఒక్క క్షణమైనా ఉండలేను
యదమెచ్చిన ప్రేమను విడువద్దు ఓ సఖీ
ఎదురొచ్చిన సుఖాన్ని విడువద్దు నా చంద్రముఖి!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments