జగత్తుకు సంబంధించి కృత్యములు ఎన్ని? అవి ఏమిటి? (వ్యాసం). గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

జగత్తుకు సంబంధించి కృత్యములు ఎన్ని? అవి ఏమిటి? (వ్యాసం). గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా .తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

జగత్తుకు సంబంధించిన కృత్యములు ఎన్ని? అవి ఏవి?
వీటిని నిర్వహించే దైవం ఎవరు?
             (వ్యాసం ... గుర్రాల)
----------------₹_₹₹₹₹------------------
ఈ జగత్తుకు సంబంధించిన కృత్యములు మొత్తం 5.
1. సృష్టి. 2. స్తితి.3. సంహారం.
4. తిరోభావం .5. అనుగ్రహం.
వీటన్నింటిని నిర్వహించే ఏకైక దైవం శివుడు. అందుకే శివుడిని పంచకృత్య కారకుడని అంటారు.
       బ్రహ్మ కేవలం సృష్టికి కారకుడు. విష్ణు కేవలం స్థితికారకుడు. రుద్రుడు కేవలం సంహార కారకుడు. మహేశ్వరుడు కేవలం తిరోభావ కారకుడు. సదాశివుడు కేవలం అనుగ్రహ కారకుడు. కానిశివుడు మాత్రం సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహం అనే పంచకృత్య కారకుడు. ఈ రహస్యమునే శివుడు సదాశివుని రూపంలో బ్రహ్మ, విష్ణువులకు ఇలా తెలిపెను.
"మత్ కృత్య బోధనం గుహ్యం కృపయా ప్రబ్రవీమివామ్"
సృష్టి స్థితిశ్చ  సంహారస్థిరో భావోష్యఅనుగ్రహః
పంచైవ మే జగత్ కృత్యం నిత్యం సిద్ధమ జాచ్యుతౌ"
పంచ కృత్యాలకు సంబంధించిన నా కర్తవ్య జ్ఞానం పరమ రహస్యమైనది. అయినను మీ పట్ల నాకు గల కృపవలన వ్యక్తం చేయుచున్నాను. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే ఈ అయిదు జగత్ కార్యములు నాకు నిత్య సిద్ధములు.
అహంకారంతో కూడిన వాడు, సంసారి అయిన జీవుడు పశువు. సర్వజ్ఞుడు, పంచకృత్య కారకుడు, సర్వశక్తిమంతుడు శివుడని తెలిపినది. అందుకే శ్వేతాశ్వతరో పనిషత్"తమీశ్వరాణాం పరమం మహేశ్వరం
ఈ దేవతానాం రామంచ దైవతమ్"
ప్రభువులకు మహా ప్రభువు, దేవతలకు దేవాది దేవుడు, పాలకులకు పాలకులు, సర్వ శ్రేష్ట దైవం శివుడని తెలిపినది. అందుకే శివుడిని పంచముఖ స్వరూపంగా ఆరాధిస్తారు. శివుడు ఒక్కొక్క ముఖముతో ఒక కృత్యమును చేయును. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన శివుని పంచముఖ ములు. పంచకృత్య కారకుడైన శివుడు బ్రహ్మ, విష్ణువుల తపస్సులకు మెచ్చి, పంచకృత్య ములలో ఒక్కో కృత్యమును నిర్వహించే భాగ్యాన్ని వారికి ప్రసాదించడం జరిగినది.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments