10th వ్యాకరణాంశాలు - సంధులు 2

10th వ్యాకరణాంశాలు - సంధులు 2

 సంధులు

1. కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి, వాటిని విడదీసి సంధిపేరు రాయండి.

ఉదా: రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. 
అత్యద్భుతం = అతి + అద్భుతం (ఇ+అ=య) -  యణాదేశసంధి 

అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. 
     గర్వ+ఉన్నతి (అ+ఉ=ఓ) - గుణసంధి
ఆ) అభ్యాగతులకు దానం చేయడం మంచిది. 
     అభి+ఆగతులు (ఇ+ఆ=య) - యణాదేశ సంధి
ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు. 
    వదాన్య+ఉత్తముడు (అ+ఉ=ఓ) - గుణసంధి
ఈ) అణ్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి.
     అణు+ఆయుధాలు(ఉ+ఆ=వ) - యణాదేశ సంధి

త్రిక సంధి

* కింది పదాలను గమనించండి.

అ) అచ్చోటు → ఆ + చోటు
ఆ) ఇవ్విధము → ఈ + విధము
ఇ) ఎక్కాలము → ఏ + కాలము

పై పదాలలో పూర్వపదాల్లో ఆ, ఈ, ఏ లు ఉన్నాయి.
ఆ, ఈ, ఏ లను 'త్రికం' అంటారు.
ఇవి సర్వనామాలు.

ఈ త్రికముమీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది.

ఆ + చోటు → ఆ + చ్చోటు;
ఈ + విధము ఈ + వ్విధము;
ఏ + కాలము → ఏ + క్కాలము

ఇలా ద్విత్వం (ద్విరుక్తం)పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది.

ఆ + చ్చోటు → అచ్చోటు
ఈ + వ్విధము → ఇవ్విధము
ఏ + క్కాలము → ఎక్కాలము

త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమౌతుంది.
బహుళం: ఒక వ్యాకరణ కార్యం నిత్యంగారావడం, రాకపోవడం, వికల్పంగారావడం, అన్యకార్యం రావడం 

- ఇట్లా నాలుగు విధాలుగా జరిగితే ‘బహుళం' అంటారు.
ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమౌతుంది.
ఆచ్ఛికం: అచ్చ తెలుగు పదం.

రుగాగమ సంధి

* ఈ కింది పదాలను గమనించి విడదీయండి.

అ) పేదరాలు     
ఆ) బీదరాలు      
ఇ) బాలింతరాలు

పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం. 
ఎట్లా మారాయో పరిశీలిద్దాం.

అ) పేద + ఆలు → పేదరాలు
ఆ) బీద + ఆలు → బీదరాలు
ఇ) బాలింత + ఆలు → బాలింతరాలు

పేద + ఆలు → పేద + ర్ + ఆలు → పేదరాలు
బీద + ఆలు → బీద + ర్ + ఆలు → బీదరాలు
బాలింత + ఆలు → బాలింత + ర్ + ఆలు → బాలింతరాలు

పై మూడు సందర్భాలలో పర పదం 'ఆలు'
పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.
పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను 'పేదాదులు' అంటారు.

పేదాదిపదాలకు ‘ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే 'ఆగమం'.
‘ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.
దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు
పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు 
రుగాగమమవుతుంది.

◆ పైన చెప్పిన మూడు పదాలలో 
    పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం) 
    ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
◆ కర్మధారయమందు పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.

పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.

అ) ముద్దరాలు = పేద+ర్+ఆలు - రుగాగమ సంధి
ఆ) జవరాలు = జవ+ర్+ఆలు - రుగాగమ సంధి
ఇ) మనుమరాలు = మనుమ+ర్+ఆలు - రుగాగమ సంధి
ఈ) కొమరాలు = కొమ+ర్+ఆలు - రుగాగమ సంధి

పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. 

ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.

గుణవంత + ఆలు → గుణవంతురాలు 
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంతురాలు

ఈ సందర్భాలలో కూడా ‘ర్’ వస్తుంది. 

కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం!

గుణవంత + ఆలు - గుణవంత + ఉ+ ఆలు → గుణవంతు + ఆలు గుణవంతు + ర్ + ఆలు → గుణవంతురాలు
శ్రీమంత + ఆలు → శ్రీమంత + ఉ+ ఆలు → శ్రీమంతు + ఆలు → శ్రీమంతు + ర్ + ఆలు → శ్రీమంతురాలు
అలాగే.. 
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ+ ఆలు → బుద్ధిమంతు + ఆలు - బుద్ధిమంతు + ర్ + ఆలు → బుద్ధిమంతురాలు

పై మూడుచోట్ల తత్సమపదాలకు 'ఆలు' కలిస్తే 
మొదటి పదం చివర ఉన్న అచ్చు 
'అ'కారానికి బదులు 'ఉ' కారము వచ్చి తరువాత రుగాగమయింది. 

దీన్ని ఇట్లా చెప్పవచ్చు.

◆ కర్మధారయమందు తత్సమ శబ్దములకు 'ఆలు' శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివరఉన్న ‘అకారానికి' ఉకారము వచ్చి రుగాగమం అయింది.

2. కింది పదాలను విడదీసి రాసి సంధి పేరు రాయండి.

  అ) జగమెల్ల = జగము+ఎల్ల - ఉత్వసంధి
  ఆ) సయ్యాటలాడెన్ = సయ్యాటలు+ఆడెన్ - ఉత్వసంధి
  ఇ) దారినిచ్చిరి = దారిని+ఇచ్చిరి - ఇత్వసంధి
 ఈ) ధరాతలమెల్ల = ధరాతలము+ఎల్ల - ఉత్వసంధి
  ఉ) దిశాంచలము = దిశ+అంచలములు - సవర్ణదీర్ఘ సంధి
 ఊ) శ్రావణాభ్రము = శ్రావణ+అభ్రము - సవర్ణదీర్ఘ సంధి
ఋ) మేనత్త = మేన+అత్త - అత్వసంధి

3. కింది పదాలను విడదీసి సంధులను గుర్తించండి.

అ) ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు+కోల్పోవు - గసడదవాదేశ సంధి
ఆ) మూటఁగట్టు = మూటన్+కట్టు - సరళాదేశ సంధి లేదా ద్రుత ప్రకృతిక సంధి
ఇ) ఆసువోయుట = ఆసు+పోయుట - గసడదవాదేశ సంధి
ఈ) కాలుసేతులు = కాలు+చేతులు - గసడదవాదేశ సంధి
ఉ) పూచెనుగలువలు = పూచెను+కలువలు - సరాళాదేశ సంధి

వృద్ధిసంధి

* కింది పదాలను విడదీయండి.

ఉదా: రసైక = రస + ఏక = ( అ +ఏ = ఐ )
అ) ఏకైక = ఏక+ఏక
ఆ) వసుధైక = వసుధ+ఏక

ఉదా: దివ్యైరావతం = దివ్య + ఐరావతం = (అ+ఐ=ఐ)

అ) దేశైశ్వర్యం = దేశ+ఐశ్వర్యం
ఆ) అష్టైశ్వర్యాలు = అష్ట+ఐశ్వర్యాలు

ఉదా: ఘనౌషధి = ఘన + ఓషధి = ( అ + ఓ = ఔ )

అ) వనౌషధి = వన+ఔషధి
ఆ) మహౌషధి = మహా+ఔషధి

ఉదా: రసౌచిత్యం = రస + ఔచిత్యం ( అ + ఔ = ఔ )

అ) దివ్యౌషధం = దివ్య+ఔషధం
ఆ) నాటకౌచిత్యం = నాటక+ఔచిత్యం 

పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు 
మీరు గమనించిన విషయాలు సరిచూడండి.
ఆ) పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లున్నాయి. 
ఇ) 'అ' కారానికి ఏ, ఐ లు కలిసినప్పుడు 'ఐ' వచ్చింది. ఐ
ఈ) 'అ' కారానికి ఓ, ఔ లు కలిసినప్పుడు 'ఔ' వచ్చింది.
అంటే...
i) 'అ' కారానికి ఏ, ఐ లు పరమైతే 'ఐ' వస్తుంది.
ii) ‘అ’ కారానికి ఓ, ఔ లు పరమైతే 'ఔ' వస్తుంది.
ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.
‘వృద్ధుల' వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి. 

సూత్రం: 
అకారానికి (అ, ఆ లకు) ఏ, ఐ లు పరమైతే 'ఐ' కారం, 
ఓ, ఔ లు పరమైతే 'ఔ' కారం ఏకాదేశంగా వస్తాయి.

4. కింది వాక్యాలు చదివి సంధి పదాలు గుర్తించి, 
   విడదీసి సంధుల పేర్లు రాయండి.

అ) సీతను అందరూ బుద్ధిమంతురాలు అంటారు.             
    బుద్ధిమంతురాలు = బుద్దిమంత+ర్+ఆలు - రుగాగమ సంధి
ఆ) అచ్చోట ఆ గులాబి మొక్కకు ఎన్ని పూలు పూచినాయో! 
     అచ్చోట = ఆ+చోట - త్రికసంధి
ఇ) రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు.                       
     దివ్యౌషధం = దివ్య+ఔషధం - వృద్ధిసంధి
ఈ) ఎవరెస్టు నధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు.      
      సాహసవంతురాలు = సాహసవంత+ఆలు - రుగాగమ సంధి
ఉ) సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం.     
     సమైక్యత = సమ+ఐక్యత - వృద్ధిసంది
ఊ) విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు.        
      ఎక్కాలం=ఏ+కాలం - త్రికసంధి

5. కింది పదాలను విడదీసి, సంధులను గుర్తించి, సూత్రాలను రాయండి.

అ) ప్రపంచమంతా = ప్రపంచము+అంతా - ఉత్వసంధి
ఆ) అత్యద్భుతం = అతి+అద్భుతం - యణాదేశ సంధి
ఇ) సచివాలయం = సచివ+ఆలయం - సవర్ణదీర్ఘ సంధి

6. కింది పదాలు కలిపి, సంధిని గుర్తించి రాయండి.

అ) నీరు + అవుతుంది = నీరవుతుంది - ఉత్వసంధి 
ఆ) ఎత్తులకు + ఎదిగిన = ఎత్తులకెదిగిన - ఉత్వసంధి
ఇ) పేరు + అవుతుంది = పేరవుతుంది - ఉత్వసంధి

7. కింది వాక్యాల్లోని సంధి పదాలను విడదీసి అవి ఏ సంధులో రాయండి.

అ) పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
     దేవాలయాలు=దేవ+ఆలయాలు (అ+ఆ=ఆ) - సవర్ణదీర్ఘ సంధి
ఆ) మధురలోని రమ్యోద్యానములు 
     చూపరుల మనస్సులను ఆకట్టుకుంటాయి.
     రమ్య+ఉద్యానములు (అ+ఉ=ఓ) - గుణసంధి
ఇ) ఛత్రపతి శివాజీ అశ్వారూఢుడు అయి శత్రువులను సంహరించాడు.
     అశ్వారూఢుడు=అశ్వ+ఆరూఢుడు (అ+ఆ=ఆ) - సవర్ణదీర్ఘ సంధి
ఈ) రాజాజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు. 
     రాజాజ్ఞ=రాజ+ఆజ్ఞ (అ+ఆ=ఆ) - సవర్ణదీర్ఘ సంధి

8. కింద గీత గీసిన పదాల్లోని సంధులను గుర్తించి సంధిపేరు రాయండి.

అ) పుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!      
     పుణ్యాంగన=పుణ్య+అంగన (అ+అ=ఆ) - సవర్ణదీర్ఘ సంధి
ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.      
     ఇవ్వీటి = ఈ+వీటి- త్రికసంధి
ఇ) ఓ మునీశ్వర! వినవయ్య                        
     మునీశ్వర = ముని+ఈశ్వర (ఇ+ఈ=ఈ) - సవర్ణదీర్ఘ సంధి 





0/Post a Comment/Comments