చలి మంటలు Dr. kandepi Raniprasad చీకటి తెరల్లో చలి గాలులు పొగ మంచుల్లో శీత గాలులు తెల్ల వారు ఝామున చినుకులు మార్గశిరం లో మంచు బిందువులు ఒంటిని ఒనికించే చలి పులి నీ ఎదుర్కోవాలంటే నాలుగు రోడ్ల కూడళ్ళలో చలి మంటలు తప్పనిసరి. ఎముకలు కోరికే చలిలో పనికి బయలు దేరాలంటే నాలుగు కట్టె పుల్లలు రాజేసి మంటలు వెయ్యాల్సిందే దుప్పట్లో ముసుగులో కన్నా రోడ్డు మీద చలి మంటలు నలుగురితో కలిసి కాచుకోవతం సరదా కబుర్లు తో బాగుంటుంది.