" మా పల్లె సీమలు"
----------------------------
పల్లెసీమ అందం
గుబాళించు గంధం
మల్లె తీగల రీతి
పెనువేసే బంధం
ప్రగతి పట్టుకొమ్మలు
కల్పతరువులు పల్లెలు
కడుపు నింపే తల్లులు
స్వచ్ఛమైన మనసులు
ప్రవహించే కాల్వలు
జలకళతో చెరువులు
పల్లెతల్లి సొగసులు
మదిని దోచు పైరులు
పిల్లల కేరింతలు
సెలయేరుల సవ్వడులు
పల్లె ప్రజల పాటలు
అపురూపం ఆటలు
జగతి ప్రగతి బాటలు
ఆధారం పల్లెలు
నిర్లక్ష్యం చేస్తే
అభివృద్ధికి బీటలు
మా పల్లె సీమలు
ఉంటేనే బ్రతుకులు
కడుపుకింత మెతుకులు
నిలబెట్టును అసువులు
-గద్వాల సోమన్న
----------------------------
పల్లెసీమ అందం
గుబాళించు గంధం
మల్లె తీగల రీతి
పెనువేసే బంధం
ప్రగతి పట్టుకొమ్మలు
కల్పతరువులు పల్లెలు
కడుపు నింపే తల్లులు
స్వచ్ఛమైన మనసులు
ప్రవహించే కాల్వలు
జలకళతో చెరువులు
పల్లెతల్లి సొగసులు
మదిని దోచు పైరులు
పిల్లల కేరింతలు
సెలయేరుల సవ్వడులు
పల్లె ప్రజల పాటలు
అపురూపం ఆటలు
జగతి ప్రగతి బాటలు
ఆధారం పల్లెలు
నిర్లక్ష్యం చేస్తే
అభివృద్ధికి బీటలు
మా పల్లె సీమలు
ఉంటేనే బ్రతుకులు
కడుపుకింత మెతుకులు
నిలబెట్టును అసువులు
-గద్వాల సోమన్న