ఇదెక్కడి న్యాయం
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖ ఐ.సి.డి.ఎస్ గ్రేడ్ 2 సూపర్ వైసర్ పోస్టు ల భర్తీకి ఖాళీలను ప్రకటించి ధరకాస్తులు స్వీకరించింది దానిలో భాగంగా నే 2.1.2022 ఆదివారంనాడు పరీక్ష నిర్వహించింది
పరీక్ష కు సంబంధించి సిలబస్ తెలియచేయలేదు మరియు పరీక్ష విధానం లో స్పష్టత లేక పోవడం కాకుండా పరీక్ష అతి కష్టతరంగా ఉండడంతో పరీక్ష రాసిన ఎవ్వరు సంతృప్తి గా లేరు కారణం ఒక్కసారి విశ్లేషణ చేద్దాం
చాలా మట్టుకు అంగన్వాడీ టీచర్స్ 10 వ తరగతి కొద్ది మంది ఇంటర్ ఆపైన ఆర్గత ఉన్నవారు ఉన్నారు.చాలా సంత్సరాల కింద నియమించబడ్డవారు 7 వ తరగతి వరకు మాత్రమే చదివినారు
క్షేత్ర స్థాయిలో పరిశీలించి చూసినట్లయితే చాలా మందికి సాధారణ ఇంగ్లిష్ బాషా పరిజ్ఞానం కూడా లేదు
300 రూపాయల వేతనం నుండి పనిచేస్తూ అన్ని ప్రభుత్వ శాఖల వారికి సహకారం అందిస్తూ పనిచేస్తున్నారు.కె.సి.ఆర్ ప్రభుత్వం వారికి రెండు పార్యాయలు జీతం పెంచింది ప్రస్తుతము టీచర్లు కు 13500 ఇస్తున్నారు.
పరీక్ష నిర్వహించవలిసిన అవసరం లేకుండా రోస్టర్ పద్ధతిలో సర్వీస్ ను అనుసరించి నేరుగా వారిని ఎంపిక చేస్తే బాగుంటుంది
ఉదాహరణకు తెలంగాణ లో జూనియర్ లెక్చరర్లు గా నాన్ టీచింగ్ సిబ్బంది ఓపెన్ లేదా డిస్టెన్స్ మూడ్ లో కూడా పూర్తి చేసిన వారిని 10 శాతం ఎటువంటి పరీక్షలు లేకుండానే
ఎంపిక చేస్తుంది.రాష్ట్ర స్థాయిలో గెజిటెడ్ స్థాయి కాకుండా అది జోనల్ స్థాయి ఉద్యోగం అది
రాష్ట్రంలో ఐ.ఏ.ఎస్,ఐ.పి. ఎస్ లో గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగులు కూడా కన్ఫర్మ్డ్ ఐ.ఏ.ఎస్,ఐ.పి.ఎస్ లు గా వారి సర్వీస్ ల ను బట్టి పదోన్నతులు కల్పిస్తున్నారు
చాలా డిపార్ట్మెంట్స్ లో అటెండ్ ర్ నుండి శాఖ పరమైన స్థాయి వరకు సర్వీస్ నే పరిగణలోకి తీసుకుంటారు పోటీ పరీక్షలు నిర్వహించారు
కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించునట్లు అంగన్వాడీ టీచర్లు కు ఎందుకు సుపెర్వైసర్ లుగా నియమించడం కోసం పరీక్షలు
విద్యుత్ శాఖలో జె.ఎల్ ఎం నియముంచబ డ్డ వైక్తి లైన్ ఇన్స్పెక్టర్ నియమించా బడే వరకు లేదా ఆ పై స్థాయి వరకు కూడా సర్వీస్ నే పరిగణనలోకి తీసుకుంటారు
మరి అంగన్వాడీ టీచర్లు కు ఎందుకు పరుక్షలు.ఒక్కసారి ప్రభుత్వం పునరాలోచించాలి. ఉత్తమంగా పనిచేసినవారికి నియామకం లో ప్రాధాన్యత ఇవ్వ0డి
తండ్రి లాంటి కె.సి.ఆర్ గారికి విజ్ఞప్తి ఏమిటి అంటే గ్రేడ్ 2 సూపర్వైసర్స్ ఎంపికలో రిజర్వేషన్ పాటిస్తూ వారు పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఎంపిక చేస్తే వారిపై
మానసిక ఒత్తిడి తగ్గుతుంది
ఒక్కసారి పునరాలోచించాలి పరీక్ష బదులు సర్వీస్ ప్రకారం ఎంపిక చేస్తే బాగుంటుంది అని మెజారిటీ అంగన్వాడీ టీచర్స్ అభిప్రాయం
ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలని
ప్రార్థన పూర్వక విజ్ఞప్తి
వి.ఎస్.ఆర్
కామారెడ్డి