" టూత్ బ్రష్!! "(బాలగేయం)-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

" టూత్ బ్రష్!! "(బాలగేయం)-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు

" టూత్ బ్రష్!! "
(బాలగేయం)
----------------------------------
దంతాలను శుభ్రం
చేస్తుందోయ్! టూత్ బ్రష్ !!
దుర్వాసన శీఘ్రం
పోగొట్టునోయ్! టూత్ బ్రష్ !!

ఉదయాన్నే అవసరం
అందరికి టూత్ బ్రష్ !!
పళ్ళను ముద్దాడును
అందమైన టూత్ బ్రష్!!

రంగురంగుల టూత్ బ్రష్!!
రకరకాల టూత్ బ్రష్!!
రమ్యమైన టూత్ బ్రష్ !!
ఇష్టమైన టూత్ బ్రష్ !!

నోటిలో ఇముడుతుంది
మలినం తొలగిస్తుంది
పళ్ళను రుద్దుతుంది
తళతళ మెరుపిస్తుంది

టూత్ బ్రష్ ! నిజమిత్రుడు
అత్యంత ఆప్తుడు
ఉదయాన్నే పలకరించు!!
ప్రేమతో ఉపకరించు!!

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు 

0/Post a Comment/Comments