శీర్షిక: మారేదెన్నడో?
స్థానికతకు చిచ్చువెట్టి
బతుకులతో ఆటవెట్టి
మాటలతో మభ్యపెట్టి
పాలుపోని పొగబెట్టి
దిగులును మా మనసునెట్టి
ఆత్మాలార్పుకుంటుంటే
నీకసలు పట్టదాయే
మా ఓట్లతో గద్దెనెక్కి
మా భవిష్యత్తుకు మంటబెట్టి
కల్లబొల్లి మాటజెప్పి
కంచంలో కాలుబెట్టె
కడుపుల్ని కాలవెట్టు
కలికాలపు పాలకుడవు
మా యాతన పట్టదాయే
మా రోదన చెవి చేరదాయే
మా వేదన రోదనలన్ని
బలిదానాలుగా మారుతుంటే
పగబట్టిన పామువలే
విషాగ్నులు చిమ్ముతున్నవ్
ఉసురును మూటగట్టుకుంటున్నవ్
నీ ఆలు పిల్లలేమో
నీ చుట్టేవుండాలే
సాటివారందరూ సంకనాకిపోవాలే
చూడలేదు నినుబోలిన
ఏలికలెన్నడు
తెలంగాణ గోస తీరేదెపుడో
మా ఆశలు పండేదెపుడో.!?
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.