కవిత

కవిత


సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

చిరంజీవుడు!!

మరణం లేని ఆయువు
వరాలు పొందిన తనువు
మార్కండేయుడంత ఆయుష్షు
కోరెడు జననీజనకులు ఆశీస్సు!

భృగు మహర్షి తనయుడు విధాత
అతని సుతుండు మృకండుడు
సతీ తనూజ సమేతంగా
హరిహరుకై మొనరించగ తపస్సు!

మృకండుడి తపోఫలంగా
హరి వరంగా 
సకల గుణం సంపన్నుడగునట్టి
హరుని వర ప్రసాదం
ఆరోగ్యవంతుడు
జన్మించెను మార్కండేయుడు!

హరిహరుల వరఫలప్రదమై
అల్పాయుష్కుడవనీ
తండ్రి మార్కండేయునికి బోధించగ
శివుని మెప్పించి దీర్ఘాయువు
పొందుతానని తపమాచరించె!

ఆయువు మూడిన తక్షణం
కాలుడు తరలిరాగ
మార్కండేయుని వైపు 
చూపు నిల్ప బావుండదని 
హరుని హూంకరింపు
మహర్షి మార్కండేయ సాష్టాంగ పడి
ప్రాణం బిక్ష కోరి
మృత్యువాత తిప్పి చిరంజీవుడాయెనా
మహర్షి!!
      ***
       హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.

మరణం లేని ఆయువు
వరాలు పొందిన తనువు
మార్కండేయుడంత ఆయుష్షు
కోరెడు జననీజనకులు ఆశీస్సు!

భృగు మహర్షి తనయుడు విధాత
అతని సుతుండు మృకండుడు
సతీ తనూజ సమేతంగా
హరిహరుకై మొనరించగ తపస్సు!

మృకండుడి తపోఫలంగా
హరి వరంగా 
స్కూలు గుణం సంపన్నుడగునట్టి
హరుని వర ప్రసాదం
ఆరోగ్యవంతుడు
జన్మించెను మార్కండేయుడు!

హరిహరుల వరఫలప్రదమై
అల్పాయుష్కుడవనీ
తండ్రి మార్కండేయునికి బోధించగ
శివుని మెప్పించి దీర్ఘాయువు
పొందుతానని తపమాచరించె!

ఆయువు మూడిన తక్షణం
కాలుడు తరలిరాగ
మార్కండేయుని వైపు 
చూపు నిల్ప బావుండదని 
హరుని హూంకరింపు
మహర్షి మార్కండేయ సాష్టాంగ పడి
ప్రాణం బిక్ష కోరి
మృత్యువాత తిప్పి చిరంజీవుడాయెనా
మహర్షి!!
      ***
సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.
చరవాణి: 9505152560


       హామీ పత్రం
ఈ కవిత నా స్వంతం ఏదేని అనువాదం కాని అనుసరణ కాని కాదు అని నేను హామీ ఇస్తున్నాను.

0/Post a Comment/Comments