ప్రబోధ గీతిక (బాలగేయం)
--------------------------------
దానవత్వం తరమాలంటే!
మానవత్వం బ్రతకాలంటే!
దైవత్వమే పొందాలంటే!
ప్రేమ దీపమే వెలిగించాలి!!
శాంతి కపోతం ఎగరాలంటే!
కాంతి పథంలో నడవాలంటే!
బంతి పూవులై విరియాలంటే!
ఇంతికి గౌరవమివ్వాలి!!
కరువులు భువిలో పోవాలంటే!
పరువు మనిషికి దక్కాలంటే!
ధరణి చల్లగ ఉండాలంటే!
తరువులు మెండుగ పెంచాలి!!
ప్రగతి బాటలు వేయాలంటే!
జగతి క్షేమము కావాలంటే!
ఖగము రీతి విహరించాలంటే
పగ,ప్రతీకారాలు వీడాలి!
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.
--------------------------------
దానవత్వం తరమాలంటే!
మానవత్వం బ్రతకాలంటే!
దైవత్వమే పొందాలంటే!
ప్రేమ దీపమే వెలిగించాలి!!
శాంతి కపోతం ఎగరాలంటే!
కాంతి పథంలో నడవాలంటే!
బంతి పూవులై విరియాలంటే!
ఇంతికి గౌరవమివ్వాలి!!
కరువులు భువిలో పోవాలంటే!
పరువు మనిషికి దక్కాలంటే!
ధరణి చల్లగ ఉండాలంటే!
తరువులు మెండుగ పెంచాలి!!
ప్రగతి బాటలు వేయాలంటే!
జగతి క్షేమము కావాలంటే!
ఖగము రీతి విహరించాలంటే
పగ,ప్రతీకారాలు వీడాలి!
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.