నిజమైన పౌర్ణమి కాంతులు
--------------------------------------------
యావత్ భారత ఖండం కార్తీ క పొర్ణమి వెలుగుల తో శోభిల్లుతుంది
మహిళమణులు భక్తి శ్రద్ధలతో
శివా రాధనలో నిమగ్నము.
కానీ నా అంతరాత్మ ఒప్పుకోక
పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిరాసక్తి ని ప్రదర్శిస్తుంది
ఏమిటా ప్రశ్న లు?
పసిపిల్లల పై పైశాచిక అత్యాచారాలు
మహిళల పై మానభంగాలు
నిరుద్యోగుల ఆకలి కేకలు
పేదవారి కడుపు మంటలు
ముదుసలి తల్లి తండ్రులు రోడ్డుపై
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు
బల వంతుల దౌర్జన్యాలు
ధనవంతుల పన్నాగాలు
అన్నదాత ఆత్మహత్య లు
కార్మికుల కష్టాలు
రాజకీయ నాయకుల నిలువు దోపిడీ
కులం పేర పరువు హత్యలు
మతం పేర మారణ హోమం
నిత్యం హోరెతూ తుంటే
ఎలా జరపను కార్తీక పొర్ణమి ?ఎలచేయను శివారాధన?
కుళ్లు,కుతంత్రాలు లేని
కల్లా కపటం లేని
స్వార్ధం, అమానుష ము లేని
దోపిడీ,దౌర్జన్యం లేని
సమతా,మమతల సమాజం
నెలకొన్న నాడే నిజమైన కార్తీక పొర్ణమి .
సంకెపల్లి శ్రీనివాస రెడ్డి
మహబూబాబాద్
సెల్:9000245448