ప్రాసాక్షర క్రమ కవిత
వీర సైనికులు
🌷🌷🌷🌷
స *మ* రములో సాహసంతో చెలరేగిన
అ *స* మాన వీర సైనికులారా
అ *జ* రామరం మీ త్యాగం
మీ *స* ము పౌరుషముగ మెలివేసి
అ *త* కరించు శత్రువులను దునుమాడి
స *త* తము కర్తవ్య నిర్వహణతో
దేశమును రక్షించి
స *గ* ర్వముగ గగనతలమున
జెండా రెపరెపలాడగ
అ *స* హాయతతో బలియగు ప్రజలకు
అ *భ* యహస్తమును చూపి
శూ *ర* త్వంతో వైరితో పోరాడుచూ
అ *న* యము వారిని కాపాడిన
అ *మ* ర సైనికులారా
భ *య* మన్నది ఎరుగక
జ *వ* నాశ్వము వలె లంఘించి
నై *ధ* నం ను ఎదిరించిన మీ
ధీ *ర* త్వమునకు శిరసొంచి ప్రణామములు...!!!
****************************************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
చరవాణి : 9381361384