" సుభాషితాలు "
--------------------------------
మ "మ" కారం పసిమి
అ "స" మానం చెలిమి
సు "జ" నుల మైత్రి కలిమి
ఆ "స" రా యే బలిమి
స "త" తము నవ్వించు
స "త" మతము త్యజించు
స "గ" ర్వంగా జీవించు
మో "స" మును ఓడించు
ఆ "భ" రణం ఉపకారం
అ "ర" నవ్వు సింగారం
వా "న" చినుకు బంగారం
కో "మ" లం తెలుగు నుడికారం
మా "య" చేయ వద్దు
అ "వ" ధులు మీరవద్దు
సు "ధ"లు చిందు తెలుగు
వ "ర" ము తెలుగు వెలుగు
--గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు,