జాజిపూల నవ్వుల్లో...
జామురాతిరి వేళ...
జాజిపూల నవ్వుల్లో...
వెన్నెల జలకాలాటలలో...
...
మా ఆశలు...
ఆలోచనలు ఆకాంక్షలు...
ఊహల ఊయల్లో ఊరేగుతువుంటే...
ప్రేమపక్షులై వినువీధిలో విహరిస్తువుంటే...
...
కలలు కమ్మగా ఉంటాయి...
ఆశలు పచ్చగా ఉంటాయి...
నవ్వులు పువ్వులై విరబూస్తాయి...
...
సంతోష సాగరాలు ఉప్పొంగుతాయి...
గుండెల్లో గుడిదీపాలు వెలుగుతాయి...
కోవెలలో దేవతలు కోటివరాలు కురిపించేరు...
...
అందుకే జాజిపూల జలకాలాటల్లో తేలితేలిపోవాలి..!
ఆజాబిలమ్మ నవ్వుల్లో జలపాతాల్లో మునిగితేలాలి..!
...
మూడుముళ్లు దక్కాలి ముక్కోటి దేవతలకు మొక్కాలి...!
జన్మజన్మలకు మనఇద్దరమే జతగాఉండే వరమివ్వమని.!
...
ఔనిది ఒక ఊహాచిత్రమో ఒక సుందర స్వప్నమో కారాదు ?
విరజాజుల విచిత్ర జగత్తులో మురిసేవేళ మునిగితేలే వేళ !
మత్తుగా గమ్మత్తుగా తూగేవేళ ఊహలఊయల్లో ఊగేవేళ !
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్