ఏంటో ఈ తీరు

ఏంటో ఈ తీరు

ఏంటో ఈ తీరు

కరోనా విజృంభించి
విలాయతాండవం సృష్టిస్తుంటే
ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు
ప్రచారార్భాటాలే తప్ప
పట్టించుకున్నదెక్కడ?

ప్రభుత్వబడులల్లో
నేడు శుభ్రత కరువైంది
నమ్మకంతోనే గదా
పల్లల్ని బడికి పంపుతున్నరు

అదేమిచిత్రమో
బడులు నేడు అపరిశుభ్రతకు
అలవాలమై అలారారుతున్నాయ్
మరి ఉంటాయాలగే
పరిసరాలను ఊడ్చేందుకు స్కావెంజర్స్ లేక
తరగతి గదులు చెత్తగా
పరిసరాలైతే పాడుబడి బడో 
మురికి కూపంగా మరింది

బడుగు బలహీనులే కదా
అక్కడుండేది మరి
పట్టింపెవరికవసరం
తాగడానికి నీళ్ళు లేవాయే
మరుగుదొడ్లు లేక
బడిమానిన పిల్లలెందరో
అధికారంకోసం
బడుగుల ఓట్లైతేగావలే
వారి అవసరాలు
భవిష్యత్తు మాత్రం
అంధకారంలోనే అతలాకుతలమై బతుకులీడుస్తూ హీనంగా నీచంగా
కూలుతున్నవి బడిగోడలే కాదు
బడుగుల జీవితాలుగూడ
ఆరోగ్యం అందించే నాధుడెక్కడో?
కనీసావసరాలనందించి
రేపటి పౌరుల
భవిష్యత్తును కాపాడండి

సి.శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments