అక్షర సిరి ..గీత (మ్) ఆగిపోయింది
సినీ గీతాల సిరి ... సినీెలాకశంలోకి
వెన్నెల్లో.. ధృవ తారల వరసన చేరెను
త్రిషత చిత్రాల గీతల రాయుడు
మెరిసేను వెన్నెల రేడు కు ...ధీటుగా
విభిన్న భావాల పలుకుల పాటలెన్నో
గాయకుల కోయిలల రాగాలతో
శృతి లయల పల్లకిలో తరతరాలు
ఉరేగును...ఉల్లాస ఉత్సాహ బోయలుగా
సీతారాముల దీవెనలతో.. అవార్డులసిరులేన్నో
వెన్నెల కంటాన మణి హార కాంతులై మెరిసేను
విధాత రాతకు తానే సిరా అయేను.
ఒంటరిగా నీరిక్షన వద్దంటూ ధ్రువతారగా నింగికేగేను
సినిమా పేరే సార్థక నామధేయమైన సిరివెన్నెల
మీ నిష్క్రమణ భువిలో ... కీర్తి జగమంతా వ్యాప్తం
కవుల హృదిలో ..కవితాక్షరాలుగా కవితగా. సుస్థిరం
సినీగీతాల ప్రేమికుల కన్నీటి జలపాతాల తో
మీకు అర్పిస్తున్నాను అక్షర తర్పణ సిరుల పుష్పాంజలి ,
రచన ఇమ్మడి రాంబాబు తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు 9866660531
హామీ పత్రం
ఈ కవిత స్వీయ రచన ఎవరికీ అనుకరణ కాదు అనువాదం కాదు అని హామీ ఇస్తున్నాను
కవిత ప్రచురించ మనవి