మానవత్వం ఒక స్పూర్తి కిరణం

మానవత్వం ఒక స్పూర్తి కిరణం


అంశం : అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం సందర్భంగా

రచయిత  : జరుగుమల్లి వీరయ్య  
                కలికిరి కొటాల            
              చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
చరవాణి : 8106974626

     *మానవత్వం ఒక స్ఫూర్తి కిరణం*

కష్టానికి చలించటం మానవ సహజం
పరుల దుఃఖానికి స్పందించటం మానవ సుగుణం
ఉత్తమమైన మానవ జన్మకి పరమార్ధం
ఎదుటివారి కష్టానికి చేసే చిరు సాయంతో
దీనజనబాంధవుడిగా చేసుకో చరితార్థం..
ఆకలిగా ఉన్న వారికి పెట్టే గుప్పెడు అన్నం
ఆపదలో ఉన్న వారికి చేసే చిరు సాయం
బాధలో ఉన్న వారికిచ్చే  ఓదార్పు నిజమైన..
మానవత్వం ఒక స్పూర్తి కిరణం.
పరుల కష్టానికి చలించి..
చెక్కుచెదరని స్వచ్చటి మనసుతో
ఐక్యత నిండిన భావంతో
సమతా మమతల విలువలతో
ద్వేషాలను తరిమికొట్టి
స్వార్థాలను పాతిపెట్టి
అసూయలను అంతం చేసి
స్నేహ హస్తాన్ని అందించి
పలువురికి మంచి మార్గాన్ని
సూచించే..
మానవత్వం ఒక స్ఫూర్తి కిరణం.
ఎక్కడైతే మానవత్వం వికసిస్తుందో
అక్కడ మంచితనం పరిమళిస్తుంది.
మనిషి మనుగడ ఉజ్వళిస్తుంది
శాంతి సుందరమైన మానవత్వం మానవ జీవితానికి ఒక స్ఫూర్తి కిరణం.

హామీ పత్రం : ఇది నా స్వీయ  రచన అని హామీ ఇస్తున్నాను.

 

0/Post a Comment/Comments