*ప్రాసాక్షర కవిత*
రచన : ఈరంకి...✍️
తేదీ : 22-12-2021.
----------------------------------------
*శీర్షిక : సాధనాత్మక జీవనము!*
(స) రుసరుసలాడుట మానుము
(హ)సహనము మనిషికి ముఖ్యము
(న) మననము చేయుము నామము
(ము)ప్రముఖుల చరితలు చదువుము
(క) సకలము దేవుని రూపము
(లి)తెలిసిన మనిషికి మోదము
(గి) రగిలిన మనసుకు తాపము
(న)వినయము కలిగిన వందనము
(మ)సమయము విడిచిన అలభ్యము
(ను)మానుష జన్మము దుర్లభము
(జు)రోజులు వృధాగా గడపకుము
(లు)కాలుని జాలము బహుబలము
(గె)సాగెడిది కాలము దినదినము
(లు)మెలుకువ కలిగి మెలుగుము
(తు)చేతురు సాధకులు యోగము
(రు)చేరుకొందురు దేవుని లోకము
-------------------------------------------
✍️ రచన
*E.V.V.S. వర ప్రసాద్,*
కవి, తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180