అక్షర నక్షత్రాలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అక్షర నక్షత్రాలు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అక్షర నక్షత్రాలు
---------------------------------------
అక్షరాల కోటలో
అనునిత్యం పండుగ
తెలుగుతల్లి తోటలో
ఆనందం మెండుగ

చదువులమ్మ ఒడిలో
ప్రతి క్షణమూ వేడుక
గురుదేవుల గుడిలో
దీవెనల హారిక

విజ్ఞానం గృహంలో
అక్షరాలు కానుక
జీవిత గగనంలో
చదువు కదా దీపిక

దైనందిన బ్రతుకులో
విజ్ఞానం సాంత్వన
అక్షరాలు భవితలో
ఎదుగుదలకు నిచ్చెన
--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments