ప్రవాహిణి వెబ్ పత్రిక ప్రచురణ కొరకు
అంశం : చరవాణి
తేదీ : 27/ 12/ 2021 సోమవారం
శీర్షిక : అరచేతిలో కీరవాణి
రచయిత : జరుగుమల్లి వీరయ్య
ఊరు : కలికిరి
చరవాణి : 8106974626
అరచేతిలో కీరవాణి
గుప్పిట్లో ఉండాల్సింది
అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది.
అదనపు అవయయం గా మారి
అవయవాలన్నిటిని ఆడిస్తుంది.
నట్టింట్లో మాటలు మాన్పి
నెట్టింట్లో ఊసులు కలిపింది. ప్రపంచానికి అవసరమని
తానే ప్రపంచమై కూర్చుంది.
ఫేస్ బుక్ ఫ్రెండ్ ఆయెను
వాట్సాప్ లే వరుసాయేను
ట్విట్టర్ లే తిండాయెను
గూగుల్ లే గుండెకాయాయెను.
అమ్మ, అయ్య మందలిస్తే కుయ్య లేదు కయ్య లేదు
అక్క బావ ఇంటికి వస్తే హాయ్ లేదు బాయ్ లేదు
ఎవరున్నా సోయ లేదు
బువ్వ తినాలన్నా యాస లేదు
గుండ్రాయి గా మారిపోయెను
వండుకొని తినడానికి ఒళ్లంతా ఒంటి నొప్పులాయెను
హోటల్ కు పోదామంటే ఓపికంతా లేక పోయెను
యాప్లోన ఆర్డరిస్తే చిటికలోన డెలివరాయెను
ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ తో
బద్దకంతో యేలుచుండెను
నేటి సెల్ ఫోన్ చరవాణి.
జేబుల్లో కీరవాణి
అరచేతిలో విశ్వ విజ్ఞాన వాణి
మాయ చేసే మహారాణి
వ్యసనాల యువరాణి
చాటింగ్ లూ.. మీటింగ్ లూ.. ఆపై రేటింగులు.. అంటూ
యువతను పెడదోవ పట్టిస్తుంది
సమాజాన్ని పట్టి పీడిస్తోంది.
ఓ మిత్రమా..!
విజ్ఞానం కోసం చేసింది
అజ్ఞానంగా వాడకు
ఊడిగమ్ చేయించుకో..
అంతేగాని బానిసగా మారకు.
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
అంశం : చరవాణి
తేదీ : 27/ 12/ 2021 సోమవారం
శీర్షిక : అరచేతిలో కీరవాణి
రచయిత : జరుగుమల్లి వీరయ్య
ఊరు : కలికిరి
చరవాణి : 8106974626
అరచేతిలో కీరవాణి
గుప్పిట్లో ఉండాల్సింది
అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది.
అదనపు అవయయం గా మారి
అవయవాలన్నిటిని ఆడిస్తుంది.
నట్టింట్లో మాటలు మాన్పి
నెట్టింట్లో ఊసులు కలిపింది. ప్రపంచానికి అవసరమని
తానే ప్రపంచమై కూర్చుంది.
ఫేస్ బుక్ ఫ్రెండ్ ఆయెను
వాట్సాప్ లే వరుసాయేను
ట్విట్టర్ లే తిండాయెను
గూగుల్ లే గుండెకాయాయెను.
అమ్మ, అయ్య మందలిస్తే కుయ్య లేదు కయ్య లేదు
అక్క బావ ఇంటికి వస్తే హాయ్ లేదు బాయ్ లేదు
ఎవరున్నా సోయ లేదు
బువ్వ తినాలన్నా యాస లేదు
గుండ్రాయి గా మారిపోయెను
వండుకొని తినడానికి ఒళ్లంతా ఒంటి నొప్పులాయెను
హోటల్ కు పోదామంటే ఓపికంతా లేక పోయెను
యాప్లోన ఆర్డరిస్తే చిటికలోన డెలివరాయెను
ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ తో
బద్దకంతో యేలుచుండెను
నేటి సెల్ ఫోన్ చరవాణి.
జేబుల్లో కీరవాణి
అరచేతిలో విశ్వ విజ్ఞాన వాణి
మాయ చేసే మహారాణి
వ్యసనాల యువరాణి
చాటింగ్ లూ.. మీటింగ్ లూ.. ఆపై రేటింగులు.. అంటూ
యువతను పెడదోవ పట్టిస్తుంది
సమాజాన్ని పట్టి పీడిస్తోంది.
ఓ మిత్రమా..!
విజ్ఞానం కోసం చేసింది
అజ్ఞానంగా వాడకు
ఊడిగమ్ చేయించుకో..
అంతేగాని బానిసగా మారకు.
హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.