"సిరివెన్నెల రేడా !!"విరి గీతపు వాడా!!"--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

"సిరివెన్నెల రేడా !!"విరి గీతపు వాడా!!"--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

"సిరివెన్నెల రేడా !!"విరి గీతపు వాడా!!"
--------------------------------
వ్రా 'సి' నాడు  సిరివెన్నెల
వి 'రి' జాజుల  పా *ట* లెన్నొ
కో :వె' లలో కవి కోకిల
వ 'న్నె' తెచ్చె తెలుగు రేడు
క 'ల' ము ఖడ్గం ఝుళిపించెను
వే 'రే' ఎవరు కాదు శాస్ర్తి గారు
ఏ 'డా' బులు లేనివారు

ర 'వి' రీతిని వెలిగినారు
సి 'రి' మల్లెల శాస్త్రి గారు
సం 'గీ' తానికి  గీతాలు
స 'త' తమూ వ్రాసినారు
అ 'పు' రూప సినీ గేయాలు
ప్ర 'వా' హంలా ప్రవహించె!!
వా 'డ' వాడలా పరుగులెత్తె!!

క 'నీ' వినీ ఎరుగని పాటలు
సు 'సా'ధ్యం చేసినారు
సా 'టి' లేని మేటి మీరు
రా 'రా' జు మీరు ఈ రోజు
అ 'గ'పించని అమరలోకానికి
క 'ల' వై కదిలిపోయినారు
రా 'రా' వా? భువికి మరోమారు 
--గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు

0/Post a Comment/Comments