బీదోళ్ళ బతుకులు
కడుపుకింత పిడికెడు బువ్వ కోసం
సెమటంత దారవోసే దౌర్భల్యం
ఆకలెక్కడికైనా తరుముతది
వారి పయ్యంత సాళ్ళ సాళ్ళుగా దున్నబడుతది
సంబురాలెరగనోళ్ళు ఎట్టిచాకిరి ఈపుకు ముడేసుకుని కూచుంటది
యాడింత పన్జేసినగని
ఆ పూటకే అయిపోవట్టే
ధరలన్ని ఆకసంలకెల్లి దిగుతలేవు సుక్కలపక్కనే
మెరిసిపోవట్టే
బతకుల్నేమో ఎలుగంతా కనరాదాయే
చేతులు గట్టుకుని నెత్తిగోకుంటనే బతుకు తెల్లార్తది
కాయకష్టం నమ్మకుని బతుకెల్లదీసే హీనస్థితి
ఏలేటోల్ల మాయమాటలు
చెవులకు బాగుంటవి
బాగుపడని బత్కుకు దారేస్తవవి
బానిస బతుకులు
ఉల్కులేని పల్కులేని ఉద్దెరబతుకులు
ఏ బాటలవోయినా
కుటిలవాజీలే ఎదురైతరు
కన్నువారజేయంగనే
పొట్టాపతి మత్తుల దిగవడ్తది
జరిగేదంతజరిగిపోతది
అతిగతిలేనితనం తమ్మబంకవట్టినట్టు ఇడ్వనేఇడ్వదు
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.