అమర్ రహే బిపిన్ రావత్
------------₹₹₹-------------------
మన సైన్యం వ్యుహ రచనా నిపుణుడు
మన జనరల్ బిపిన్ రావత్
ఆ మహనీయుని కోల్పోయి
విలపిస్తున్నది మన భారత్ !
పాకిస్తాన్ సర్జికల్ స్టైర్స్ విజయుడు
మయన్మార్ ను ఢీకొన్న అజేయుడు
సైన్యంలో పలు సంస్కరణలకు ఆద్యుడు
సైనిక హృదయ చికిత్సా వైద్యుడు !
భారత ఆర్మీ చీఫ్ గా ఎన్నికైన వాడు
భారత సైన్యలో మణిపూసగ వెలిగాడు
థియేటరైజేషన్ ప్రణాళిక ఆద్యుడు
థియరీ సైన్యఎమోషన్ పెంచిన రుద్రుడు!
మన దేశం జనరల్ బిపిన్ రావత్
ఘన హిందూ గర్వాలి రాజ్ పుత్
మార్చి 16న 1958 జన్మించాడు
డిసెంబర్ 8న 2021 పరమపదించాడు!
ప్రాణాలను లెక్క చేయక దేశం కోసం
నిర్విరామ కృషి సల్పిన సాహస వీరుడు
అతని త్రివిధ దళాలకు ఆధిపత్యం వహించిన ధీరుడు
ఓర్వలేక కొని పోయెను నేడు ఆ దేవుడు !
ఐ.రా.స శాంతి దళాలకు ఆయన అధ్యక్షుడు
ఉగ్రవాద దళాలను ధ్వంసం చేసిన దక్షుడు
త్రిదళం సైనిక స్థావరాల బలాల రక్షకుడు
వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచిన శిక్షకుడు!
భరతమాత ఈ ముద్దుబిడ్డ ఇక ఇల లేడు
భారతావనిలో ఇక మనకు కానరాడు
వెలిగి వెళ్ళిపోయెనుగా ఆ అమరపురికి
మిగిలి పోయానుగా అమరుడై మన మదికి !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.