లక్ష్మణ రేఖలు.
--------------------
41). ఘన సర్కారు పాఠశాలలు
మన పిల్లల పాట్ల శాలలు
ఎల్లరూ అంటున్నారంట
ఇక పిల్లలకు కల్గునుతంట !
42). అవినీతి మూట ఊటను వీడు
పాపభీతి ప్రీతి పాటను పాడు
అవనీతి పోస్టర్.కు కొట్టు పేడ
నీతి విక్టర్.కుపట్టు గొడుగునీడ !
43). మాస్క్ లేకుండా కనిపించ వద్దు
రిస్కు తీసుకుని జాగ్రత్త వహించుట ముద్దు
చెదిరిపోవురా ఇక కరోనా పద్దు
ఎమిక్రాన్ వైరస్ ఊసు ఔలే రద్దు!
44). కాకు కరోనాతో నీవు సతమతం
నీకు తెలియజెప్పుటే నా అభిమతం
ఒళ్ళు నొప్పులతో ఔతావు ప్రభావితం
టీకా తీసుకుంటే ఔలే అంతా సుఖాంతం !
45). కరోనాపై పెంచుకో ఏకాగ్రత
ప్రయాణికులతో బహు జాగ్రత
ఎంచుకొని సంచరించు మిత్రమా
పరిసరాలను గమనించు నేత్రమా !
46). మళ్ళించకు కరోనా వైపు బాల్యాన్ని
చెల్లించకు దానికి నీవు మూల్యాన్ని
బాలల భవిష్యత్తును వీక్షించు
భావి భారత పౌరులను రక్షించు !
47). అవినీతి అక్రమాల సహించ వద్దు
నీతి నియమాల ఆవహించుకొనటే ముద్దు
నైతికత స్మృతి అప్పుడు పెరుగు
అనైతికత సంస్కృతి ఇక తరుగు !
48) దేశానికి అన్నదాత మన రైతు
వేషానికి అతడు పల్లెటూరు బైతు
అంటారు అందరూ అతనే రాజని
వినిఉంటారులే మీరువారిమోజుని
49) నువ్వు మాట్లాడే మాటే మంత్రం
ఆకలితో పోట్లాడే నీ కాయం ఓ యంత్రం
మాట్లాడు అందుకే ఆచితూచి
పోట్లాడుట ఎందుకు వైరితో వేచి!
50). పదుగురి సుఖమును యెంచి
నీ విజ్ఞానమును వారికి పంచి
చదువు విలువను పెంపొందించండి
పదవిప్రమిద జ్యోతినే సంపాదించండి !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.