లక్ష్మణ రేఖలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

లక్ష్మణ రేఖలు. బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్ 9491387977.

లక్ష్మణ రేఖలు.
---------------------
21). గొంతులో ఊపిరి నైపుణ్యం
        కాయంలో సరాసరి నైపుణ్యం
    ఉన్నంతవరకు రోగికి వైద్యుడు చికిత్స చేస్తూ కావాలి ఆద్యుడు.  !

22). గోవిందా గోవిందా అను
గోవిందుని బృందగానం విను సదానందం సదానందం అను మహదానందాన్ని నీవిక కను !

23). ఆపత్కాలమునకై ధనమును
అలవర్చుకో దాచిఉంచేగుణమును
నీ వారికై ఆ ధనమును చేయి వ్యయం
భవిష్యత్తులో ఉండదులే నీకు భయం !

24)). కామ క్రోధ లోభ గుణములే
మనకు నిజమైన శత్రువులు
నీవో కంట వానిని కనిపెట్టు
ఈ మూడింటిని విడిచిపెట్టు!

25). తప్పుడు పనులు ఎప్పుడు చేయకు
నిప్పుల కుంపటి గప్పున తలపై మోయకు
ముప్పుల గనులకు దారిని తీయకు
మండే గాయంపై ఆజ్యం పోయకు.!

26). గోవు నీరు భూమి తల్లి
మనందరికీ జన్మనిచ్చిన మాతలు
వీనికి దుఃఖం ఎప్పుడు
 కలిగించవద్దు
వానికి సదా సుఖం కలిగించుట ముద్దు!

27). నీచులకు చేయకు ఉపకారం
చేస్తే నీకే కలుగును అపకారం
పాలుపంచుకొని చుట్టుకో శ్రీకారం
మేలు ఎంచుకొని పెంచుకో సహకారం!

28). సంతోషంగా ఉండడం గొప్ప వరం
విద్వేషంతో ఉండడం కండకావరం
భగవంతుడి కన్నా గొప్పది సత్యం
తెలుసుకొని మసలుకో నీవు నిత్యం!

29). అవినీతి సుడిగాలి వంటిది
       ఆ సుడిగాలిలో ఎండుటాకు 
       వలే నీతి నియమం కొట్టుక 
        పోతాయి ఏ గట్టుకు చేరక !

30). మర్రికి చిన్న చిన్న పండ్లు ఎందుకు ఉంటాయి?
నీడలో జనం వి శ్రమిస్తారు గనక
తీగకు పెద్ద గుమ్మడి కాయ పండు ఎందుకు?
దాని నీడకు ఎవరు రారు గనుక!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సర్వే నంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments