లక్ష్మణ రేఖలు.
---------------------
11). మాస్కులే టీకాలుగా పనిచేస్తాయి
ఒమిక్రాన్ వైరస్లను చంపేస్తాయి
నిత్యం వాడాలోయి ఇక మాస్కులు
సత్యం తొలగిపోవునోయి దాని రిస్కులు!
12). ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది తెలుసుకో
తెలుసుకొని నీవు జాగ్రత్తగా ఇక మసలుకో
కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాధి ఇది
ప్రపంచాన్ని కలవరపెడుతున్నది !
13). మళ్లీ అలజడి పెరిగింది
కరోనా ఒరవడి మరి ఇది
నూతన రూపం సంతరించుకుంది
ఒమిక్రాన్ తన పేరు అంటుంది!
14).గత డెల్టా వేరియంట్ కన్న
ఒమిక్రాన్ వేరియంటే మిన్న
ఇది మెల్లగా జడలు విప్పుతుంది
పగబట్టిన పామై విషం కక్కుతుంది !
16) అన్ని దానముల కన్న
విద్యాదానమే మిన్న
తెలుసుకోవాలి నీవన్న
తెలుపుటకు నీకునేనున్న !
17). న్యాయానికి తూట్లు పొడవకు
ధర్మ పథాన్ని నీవు విడవకు
అధర్మాన్ని పావుగా వాడకు
కర్మ కర్మ అనకు తడవతడవకు!
18). అవహేళనలను అధిగమించు
అవమానాలను విధిగా ఎదిరించు
అప్పుడే అంది వచ్చు విజయం
ఇంకెప్పుడు పొందవులే అపజయం!
19). అగ్నిని నోటితో ఉదరాదు
వివస్త్ర స్త్రీని చూడరాదు
అశుధ్ధాలను అగ్గిలో వేయరాదు
అపరిశుద్ధులై బుగ్గి పాలు కారాదు !
20). స్నేహమూ -విరోధమూ
దుర్జనులతో చేయవద్దు
చెలిమి -బలిమి కలిగి
సజ్జనులతో ఉంటే ముద్దు!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.