కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డ్ లింగాపూర్ గ్రామానికి చెందిన వైద్య శేషారావు, ఉమారాణీ దంపతులు ఇరువురికి ఐ.ఎస్.ఓ గుర్తింపు కల్గిన అంతర్జాతీయ సాహిత్య,సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక వారు రెండు తెలుగు రాష్ట్రాల లో చర వాణి అంశంపై కవితల పోటీ నిర్వహించగా వాటి పై ఉత్తమ కవితలు రాసినందులకు బోయి హైమవతి భీమన్న అధ్యక్షులు,డాక్టర్ కత్తిమండ ప్రతాప్ పూర్వ ఏ.పి సాహిత్య అకాడమీ సభ్యులు అభినందిస్తూ ప్రశ0సా పత్రం అంతర్జాలం ద్వారా అందించారు.నిత్యం సాహిత్య కార్యక్రమంలో పాల్గొంటూ సామాజిక సమస్యల పై స్పందిస్తూ ప్రజలలో చైతన్యానికి కృషి చేస్తున్న దంపతులను పలువురు అభినందిస్తూ న్నారు